నా చెట్టు – కె గోదావరి శర్మ-

నా చెట్టు
కె గోదావరి శర్మ-
గారి ఈ కవిత చదివిన వెంటనే మనసు ముగ్ధమైపోయింది. కవి భావుకత్వం పరిపూర్ణంగా వికసించినప్పుడు తప్పితే ఇంత చక్కని కవిత్వం పుట్టదు కదా! ముఖ్యంగా..
“రాత్రంతా కన్న కల్లల్ని
మంచుబిందువులుగా మార్చి
ఆకుల చివర ముత్యాలతోరణంలా వ్రేలాడతీసి
తూర్పువైపు తిరిగి
ఆశలకి నీళ్ళొదిలేస్తుంది”
అన్నవి ఎంతకాలమైనా వెంటాడే పాదాలు!
కవిత చదవంగానె ఎందుకో మీకూ వినిపించాలనిపించింది !
ఇదీ ఆ కవిత పూర్తిగాః

చిన్నప్పటినుండి చూస్తున్నాను
భూస్థాపితమై పోయిన నా చెట్టు
ప్రతి రాత్రీ
ప్రపంచం నిద్రలో ఉన్నవేళ
ఎక్కడికో
పారిపోదామని ప్రయత్నిస్తుంది.

మనుషుల్లో మూఢభావాల్లా
పాతుకుపోయిన వేళ్ళు
మట్టిని కౌగలించుకుని నిద్రలేవవు.

చెట్టు మాత్రం
పటువదలని విక్రమార్కుడిలా
గాలిభుజంమీద చెయ్యివేసి
భూమిపట్టు వదిలించుకోవాలని
విశ్వప్రయత్నం చేస్తుంది.
ఊపిరి బిగపట్టి
నిశ్శబ్దంగా గింజుకుంటుంది.
ఆకాశంవైపు ఆశగా చూస్తుంది
గాలిలో ఎగిరిపోవాలని కలలు కంటుంది.
ఒళ్లంతా వెన్నెల ముద్దులతో నిండినవేళ
చంద్రుడికేసి చూస్తూ
విరహంతో నిట్టూరుస్తుంది.

రాత్రంతా కన్న కల్లల్ని
మంచుబిందువులుగా మార్చి
ఆకుల చివర ముత్యాలతోరణంలా వ్రేలాడతీసి
తూర్పువైపు తిరిగి
ఆశలకి నీళ్ళొదిలేస్తుంది.
సూర్యుడి ముందు
పట్టుబడిన దొంగలా
తలొంచుకు నిలబడుతుంది.
పారిపోయిన గాలిని తిట్టుకుంటూ
సాయంకాలంకోసం ఎదురుచూస్తూ…

మాంత్రికుడు జితో..చెకొస్లావేకియా కవితకి -వి ఆర్ వేలూరి అనువాదమ్

మహారాజ రాజ రాజపరమేశ్వర రాజమార్తాండ వగైరా
మహారాజులుంగారిని
ఖుషీ చెయ్యటంకోసం
మంచినీళ్ళు మధువుగా మారుస్తాడు
వదరుకప్పల్ని వందిమాగదులుగా
బొద్దింకల్ని పోలీసువాళ్ళుగా
మారుస్తాడు.
పందికొక్కుని పాలగూడెం బాబా చేస్తాడు.
వంగి సలాంచేసి
వేళ్ళ చివళ్ళ మల్లెపూలు పూయిస్త్తాడు.
ఛూమంతర్!
మాట్లాడే మైనా వాడి భుజంమీద కూర్చుంటుంది అక్కడ.
‘ఇంకో కొత్త మాయ ఆలోచించు,
నల్లటి నక్షత్రం
పొడిపొడి నీళ్ళూ…!’-అని ఆజ్ఞాపిస్తారు
మహారా…………………………జులుంగారు.

నల్లటి నక్షత్రం
పొడిపొడి నీళ్ళూ చేస్తాడు.
ఓ విద్యార్థి వచ్చి
‘ఒకటికన్న యెక్కువైన sine తీటా ఉహించు!’
అని అడిగితే
వెలవెలబోయిన

మాంత్రికుదు జితో

మైనెస్ ఒకటినుంచి ప్లస్ ఒకటిదాకా మాత్రమే
అరిచి గింజుకున్నా
ఏంచెయ్యలే దాన్ని’
అంటూ నీళ్ళు నములుతాడు.

మహారాజదర్బారునుంచి
వందిమగదుల మూకనుంచీ
నిశ్శబ్దంగా నిష్క్రమిస్తాడు
మాంత్రికుడు జితో
తన గూటికి.
(మీరాస్లాన్ హోలూచ్ అనే చెకోస్లావేకియన్ ‘వైద్యుదు-కవి’ రాసిన Zito the magician అన్న వచన పద్యానికి వి ఆర్ వేలూరి స్వేచ్చానువాదం)

ఇంద్రకంటివారి కంట పాలరాతిబొమ్మ పడితే?

పాలరాతి విగ్రహాన్ని మనం చూస్తే ‘ఆహా..ఎంత బాగుంది’ అని  ఒకసారికి మెచ్చుకుని వదిలేస్తాం. అదే ఇంద్రకంటి హనుమచ్చాస్త్రిగారి వంటి భావుకుని కంటపడితేనో?!
” ఈ తళుకెట్లు వచ్చినది!
ఏ పువురేకుల పాలు పిండి యీ
రాతిని చేసె ధాత; పర
రాజులు తాకుట కోర్వలేని యే
నాతి శరీర రేణువులు
నవ్వుచు జేరెను పాలరాతిపై
ఏ తరుణానిలమ్ములిట
ఇంతటి ఊపిరి పోసి పోయెనో!”..అని తన్మయులై పోతారు.

“మదనుడు వైచినట్టి బాణము త్రోవ తప్పి,
రెద లుడికింప బోవుటల
నేమరి, సూటిగ తాకెనేమొ, యీ
కదలని పేదరాతికి, వి
కాసము నిచ్చినమాట వింటివే!
పదనగు మల్లె పాటవము
పాలను రాతిని పొంగజేసెనో!”
అని మన మనసులకూ గిలిగింతలు పెట్టేస్తారు.
అదీ కవికీ..మనకీ మధ్య తేడా!
ప్రకృతితల్లి అందాన్ని తనివితీరా పొగిడే ధన్యజీవి – కవి.

అశ్రునివాసి-బావుల్ కవితకి రవీంద్రుని అనువాదం

అశ్రునివాసి
అతని మాటలు వినడానికి నేను దేశదేశాలు తిరిగాను.
కాని అయ్యో! అంతా వృథానే అయిపోయింది.
నేను తిరిగి వచ్చినప్పుడు  విన్నాను అతన్ని వింతగా
నా స్వంత పాటలోనే!

ఎవరివయ్యా నువ్వు? అతన్ని వెదకడానికి  బిచ్చగాడిలాగా గడపగడపా తిరుగుతున్నావు?
నా హృదయ సీమలోకి రారాదా.. అతని ముఖాన్ని చూపిస్తాను
నా కన్నీటిలోనే!

బావుల్ పాటకు విశ్వకవి రవీంద్రుని అనువాదానికి తెలుగు సేత
వివరణః వంగసీమలో ఒక విధమైన యోగసాధకులను ‘బావుల్’ అంటారు

తెలుగుతల్లి గీతకర్త కీ।శే॥ శంకరంబాడి సుందరాచారి గారి-‘నవ్విన నవ్వి పోవనీ’ లోని ఒక ముఖ్యమైన మూడు పద్యాలు

తెలుగుతల్లి గీతకర్త కీ।శే॥  శంకరంబాడి సుందరాచారి గారు కవితాప్రయోజనాన్ని కామినీవిలాసంతో కాకుండా.. కన్నతల్లి వాత్సల్యంతో కమనీయంగా పోల్చిచెప్పిన అర్థశతాబ్దం కిందటి అర్థవంతమైన కవిత ‘నవ్విన నవ్వి పోవనీ’ లోని ఒక ముఖ్యమైన మూడు పద్యాలు
అందములేని యాకృతికి నందము కూరిచి, మందిమీద కే
సందె వెలుంగులోన తగుచాటున చక్కగ నక్కి కృత్రిమా
నందము నీయ న న్వలచునట్లు నటించెడు భోగకాంత చ
క్కందముచూపి తన్పకల కామిని కావ్యసుమాంగి కాదు, నన్;

కనిన దినమ్మునుండియును, కంటికి రెప్పగ కాచి పెంచి, స
ద్గుణములు నేర్చి, సంఘమున కూడి చరించెడు శక్తినిచ్చి, పె
న్చనవున చక్కదిద్ది, సుఖసంపద చే నిడు పూర్ణమూర్తి యా
జననియె కావ్యమాత యని స్వాంతములో తలపోసి, పూనెదన్ః

భావుకులన్న పేరిటను వందలువేలుగ దేశమెల్లెడన్
తావలమంది, నవ్యకవితా వనవాటుల కోకిలమ్ములై,
భావము బంధము న్వదలి పల్కులనల్లి పదాలు పాడు ‘పుం
భాసర్స్వతీప్రియులు’ ఫక్కున నవ్విన నవ్విపోవనీ!

గంధపు కట్టెలు

హెచ్చరికః ఇది వేదాంతం. వంటికి సరిపడని వాళ్ళు దూరంగా ఉండటం మంచిది సుమా!
గంధపు కట్టెలు
(కవిత్వమంటే అదీ..కవి అంటే అతడూ!)
కంటికిగడవెడుగా నేడ్చు కులకాంత గడప దాటియు గూడ గదియరాదు
కడుపు చుమ్మలుచుట్టగా వందిరెడి తల్లి కాటివఱకుగూడ గదియరాదు
గడియించుసర్వమ్ము గైకొన్న సుతుడెల్ల కాలుదాకంగూడ గాంచబోడు
కడుమేళ్ళు తనవల్ల గన్నవారు తిలోదకమొసంగుటకేని కానబడరు

ఔనె! బ్రతికినన్నాళ్ళు నిసానబట్టి-నట్టి గృహమేథి తొఱగి కాయంబు చితిని
గాలుచుండ దోడుఱికి యంగంబు వాయు-చుందు నీవంటివారేరి చందనంబ?
-మిన్నికంటి గురునాథ శర్మగారి- అడవి పువ్వులు-నుండి!

ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన తల్లికాని,, ఇల్లాలు కాని, సంపాదనంతా అందుకున్న పిల్లలు కానీ, బతికున్న కాలంలో ఎన్నో మేళ్ళు పొందిన బంధుబలగం కానీ ఎవ్వరూ ప్రాణం పోయిన తరువాత తోడురారు. బతుకున్న కాలంలో రాచి రంపాన బెట్టినా..అవేమీ మనసులో పెట్టుకోకుండా కట్టె చితిలో కాలుతున్నప్పుడు కూడా తోడుగా సహదహనమయే గంధపుకట్టెలను గూర్చి కవి ఎంత ఉదాత్తంగా కల్పన చేశాడో కదా! కవిత్వమంటే అదీ..కవి అంటే అతడూ!

అమృతం చీమలకు భయపడితే ఏమవుతుంది?

అమృతం అమరలోకలోనే ఎందుకు దిగబడి పోయిందో తెలుసాండీ..చీమలకు జడిసిట. వసురాయడు ఒక చాటువులో చమత్కారంగా చెబుతాడూః
చీమలకడలి, పయోనిధి
లో మొదలం దాగి, దైత్యులున్ సుర లెత్తన్
భూమి గనకభయ మమృతం
బామరలోకమున కరిగె హాయిగ బ్రదుకన్!
మొదట్లో సముద్రంఅడుగునే  దాగి ఉండిట. దేవతలు, రాక్షసులు పైకి లాగే ప్రయత్నం చేస్తుంటే భూమ్మీది చీమలకు జడిసి నేరుగా అమరలోకంలో స్థిరపడిపోయిందని పద్యం చమత్కారం

వేలూరి శివరామశాస్త్రి గారి వ్యంగ్యం- “నిష్కాసనం”

 

సర్వాంతర్యామికేఅంగుళంలేదుచోటు..మాభూస్థలినెంతగాలించినాకానీ…!

 

వేలూరిశివరామశాస్త్రిగారివ్యంగ్యం– “నిష్కాసనం

 

 

మాగృహసీమలన్నియునుమజ్జనశాలలుపాకశాలలున్

 

రోగపుశాలలున్మఱియురొక్కపుశాలలునింకదక్కుచో

 

భోగపుశాలలేఇచటబుట్టదుబెత్తెడునేలనీకునిం

 

దేగతివచ్చు? వచ్చినటులేగుమ!ముందరనేగుమీశ్వరా!

 

 

మీయింటియందునెమ్మయిజోటులేకుండుగాకమీయూరనెక్కడనొయుందు

 

నందువా? యెంతటిమందుండవింతమిక్కుటమైనవెర్రికక్కుఱితియేల?

 

గ్రామమధ్యంబదికలుగదా? యందువా? కరణమ్ముగారదికలుపుకొనిరి

 

గోష్టంబులందుండగోరుదువా? క్రొత్తలేగదూడకుగూడలేదుచోటు

 

బంజరెందేనిచిక్కదాప్రభువువినినజేతికరదండములుముందుచిక్కగలవు

 

ఇంకనెందేనిజూడుమా! యెంతవెర్రివేగుమేగుమనిలువకయీశ్వరుండ!

 

 

అక్కడమూడుతావులరుదారగనూరకయున్నవవ్వియా?

 

యొక్కటిక్రీస్తువారలకునొక్కటియల్లతురుష్కజాతికిన్

 

జిక్కెశ్మశానభూములుగశేషముమాకదిరచ్చపట్టుగా

 

దక్కెనునాలుగేండ్లఫలితంబదినీకెవడిచ్చుజెప్పుమా!