కవిత్వమంటే?!-వాకిలి-ఇ-పత్రికలో ప్రచురితం

కవిత్వమంటే?!

24-మే-2013

 

కరవీర కుసుమము, గులాబీ పువ్వు కళ్ళు తెరిచాకా దాదాపు ఒకే రూపు. మొగ్గలుగా ఉన్నప్పుడు మాత్రం ఒకటి గుడి ఒకటి గోపురం. వీటి మూల రహస్యం ఏమిటో తేల్చుకుందామని కాచుక్కూచుంటే..ఎపుడో ఒక నిశ్శబ్ద గడియలో రససెల్లాలో నుంచి తొంగిచూసే ముగ్ధ వధువు లాగా మిసమిసలాడుతూ ప్రఫుల్ల నేత్రాంచలాలను రెపరెపలాడిస్తాయి. సృజన జన్మరహస్యం మాత్రం అంతుబట్టదు!

దారిన పోతొంటే కాలికి ముల్లు గుచ్చుకోవచ్చు. అపురూప సౌందర్యరాసి సందర్సన సౌభాగ్యమూ దక్కవచ్చు. విడివిడిగా రెండు విరుద్ధ సంఘటనలే కాని సమన్వయించే సామర్థ్యముంటే అవే ఓ అభిజ్ఞాన శాకుంతలాంకురాలు. సమన్వయ శక్తికి పాదు ఎక్కడో తెలియదు!

పట్టుబట్టి ఎప్పుడో కలం కాయితాలు పట్టుక్కూర్చుంటే బుర్ర బద్దలవడం తప్ప ఫలితం సున్న. పదాలనాశ్రయించీ, పాదాలను దిద్దీ, పర్వతం ప్రసవించినట్లు ఓ మాటల కుప్పను పోగేసినా కవిత్వమనిపించుకోదు. శ్రీరస్తు నుంచి శుభమస్తు దాకా సమస్త శ్రీమదాంధ్ర మహాభాగవతాన్నీ మహానుభావుడు బమ్మెర పోతనామాత్య్డుడు ఒక్క ఉదుటనే పద్యాలబండిలా తోలుకెళ్ళాడన్నా నమ్మలేం. కావ్యాలేమన్నా శాసనాలా? కాళిదాసు కుమారసంభవమేంటి.. ఆఖరుకా సాక్షాత్తా శ్రీశంకరభగవత్పాదుల సౌందర్యలహరైనా సరే .. ఒక్క బిగినే ‘ఇతిసమాప్తః’ అవడం అసంభవం. ఒక వాక్యం ఒక్క సారే అతకదు. ఒక అర్థం ఒకసారే పొదగదు. ఒక భావం ఒకే సారి పొసగదు. సృజన-భావాత్మక స్థాయీభేదమా? దానికదే ఓ అంతిమ ఆత్మస్వరూపమా? ఉచ్చారణ మొదలు భావాంత పర్యంతమూ సర్వ జీవశక్తులూ విభావాదుల్లా వివిదౌపచారికాలు నిర్వహిస్తేనే కదా ఏరసభావానికైనా ఓ అంతిమ స్థాయి! అంతిమం సరే..రసం అసలు ఆది కొసేదో అంతుబట్టదు!

ఒక కొబ్బరి చెట్టు. దానికి వంపుగా సొంపుగా వాలి నట్లున్న శాఖకు వరసగా తోరణాలు కట్టినట్లు ఆకులు. వాటి మీద ఉదయభానుడి లేత కిరణాలు పడి కోమల మలయ సమీరానికి ఒకటొకటే క్రమంగా కదులుతోంటే ‘తరుణాంగుళీచ్చాయ దంతపు సరికట్టు లింగిలీకపు వింత రంగులీనింద’న్న భావాక్షర వీణాతంత్రి సాక్షాత్కరమవడం లేదూ! శరద్రాతుల్లోఐతే గోపాలకృష్ణయ్య ఎక్కడో నక్కి వేణుదండం మీద గర్భకేతకీ దళం వంటి వెన్నెల వేళ్ళతో చాలనం చేస్తున్న సమ్మోహన ఊహ మనసు నూయల లూగిస్తుంది . అక్కడితో ఆగితే మంచిదే! అవ్యక్తంగా ఆ వేణు స్వరాలు మన కర్ణద్వయంలో నర్తించుతో గుండెలకు రెక్కలు తొడిగి ఏ గంధర్వ లోకాలకో ఎగరేసుకు పోవచ్చు. ఏ వరూధినో రత్నసానువు కోన భోగమంటపాన కనిపించి లోకాలకు దారే తోచనీయకుండా మీది మీది కొచ్చేయచ్చు. మళ్ళీ కాళ్లు నేలకాని నిట్టూర్పుసెగలు చురుక్కుమనిపించే వరకూ..సాగే ఆ భావాంబర వీరవిహారం పేరేమిటో? నింగిని వదిలి నింగికి దిగిందాకా మనసున సాగే ఊహా విహంగ యానమంతా కవిత్వమేనా పాకం పడితే? మరైతే ఆ పాకం పండేదే ఎలా? ఆ అనుపాకం సమపాళ్ళు ఆరంభంలో తెలిసిందే పుంభాసరస్వతికో?

చెరువు గట్టు కెళ్ళి కూర్చున్నామనుకోండి సరదాగా ఓ అందమైన సాయంకాలం పూట మిత్రబృందమంతా కలసి. ప్రేషించబడ్డ నాగసంతానమంతా సర్పయాగంలో ఆహుతి నిమిత్తం తరలిపోతున్నభ్రాంతి కలిగిస్తుంది మన వైపుకే ఉరికురికొచ్చే అలల సందోహం! అవే తరంగాలు మరో మిత్రుడి కంటికి పరుగుపందెంలో గెలుపు కోసం ఉరకలెత్తే చురుకు కురంగాలనిపించొచ్చు. ఇంకో నేస్తానికి దోస్తులంతా కలసి చేసే ఈత వినోదంలా తోచవచ్చు. నాచన సోమన-’హరివంశం’ సత్యభామ హరికంటికొక రకంగా..అరి కంటికింకో తీరుగా తోపించినట్లు.. ఒక్కవస్తు సందర్శనంలోనే ఎన్ని భావలోకాలో! కవైన వాడికైతే గుండెల్లో బొండుమల్లెల చెండు వాసనలు గుబాళించవూ! చేతిలో రాతసాధనం లేనంత మాత్రాన ఊహలో పొంగులెత్తే రసగంగ ప్రవాహం భంగపడుతుందా? మదిలో ‘మా నిషాద’ శ్లోకభావం కదలాడినప్పుడు వాల్మీకి కవి హస్తాన ఏ గంటముందంట? ‘మాణిక్య వీణా ముపులాలయంతీ’ అంటో కాళిదాసు గళానలా ఆశుకవితాజల సెలయేరులా గలగలా పారినవేళా లేఖినేదీ దాపునున్న దాఖలాల్లేవే! పైసాపైసా కూడబెట్టే లుబ్ధుడికి మల్లే రసలుబ్ధుడైన కవీ రసాదికాలకు ఆది మూలమైన భావ దినుసులను ఏ హృదయపేటికలో భద్రపరుస్తాడో? ప్రయోగించే సందర్బరహస్యాన్నెలా పసిగట్ట గలుగుతాడో?

అలాగని ప్రతీ మనిషీ ఇలా కనిపించిన ప్రతీ దానిలోనల్లా కవితామతల్లినేదో కల్పించుకొని ఆమె రూపురేఖాదులను అల్లిబిల్లిగా అల్లుకుని పోతానంటే ‘అనంతా వై వేదాః’ అన్నట్లు ఈ పాటికీ ఈ భూమండలమంతా కవిల కట్టల్తో నిండి ఏడు సముద్రాలూ పూడిపోయుండేవి కావా! ‘ఆ దస్తరాల్లో చిక్కడి పోయే దుస్తరం తప్పింది.ఆనందమేనం’టారా? మరి మిణుగురు పురుగులా తటాల్మని తట్టే సీతాకోకచిలుక మల్లే మనోభావం చటుక్కుమనెటో ఎగిరిపోతేనో? గుప్పెట పట్టి గూట్లో పెట్టే సాధనమంటూ ఏదో ఒకటుండటమూ ఉత్తమం కదా? గాలీబ్ మహాశయుడికేదైనా ఓ అందమైన భావం మదిలో కదులాడటం మొదలవంగానే పాటగానో పద్యంగానో గుణించుకుంటో అందుబాటులో ఉన్న ఏ దస్తీతోనో..ఆఖరికే అంగీ అంచుల పోగుతోనైనా సరే ముచ్చ్టటైన ముడులుగా మలుచుకునే అలవాటు. తీరిక దొరకబుచ్చుకొని మళ్ళా ఆ ముళ్ళనలాగే విప్పుకుంటో చూచిరాతంత చక్కంగా పద్యాలు చెక్కి వుండక పోతే మనకీ రోజు ఇన్నేసి చక్కని కైతల పాతర్లు దక్కుండేవా?

చింతచెట్టు చిగురు కంటబడంగానే ‘చిన్నదాని పొగరు’ పాట చటుక్కుమని గుర్తుకొస్తుంది. రెండింటికి సామ్యమేమిటో? నల్లటి బుర్రమీసాలాసా మెవరన్నా ముదురుపెదాల మరుగునుంచీ బలిష్టమైన లంకపొగాకు చుట్టపీకొకటి లంకించుకుని గుప్పుగుప్పుమని పొగొదుల్తూ కనిపిస్తే రైలుబండే రోడ్డు మీదకొచ్చినట్లనిపిస్తుంది ఎంత జడ్డికైనా. అక్షరానికందకుండా అగరు ధూపంలా అనుభవించి వదిలేసే ఊహావల్లరులనలా వదిలేసినా.. ఎన్నటికీ అణగిపోని కొన్ని భావమణుల వెలుగుజిలుగుల వెనకున్న రహస్యమేమిటో? తెర వెనక్కి వెళ్లినట్లే వెళ్ళి ఆదృశ్యమో.. సాదృశ్యమో తటస్థించినప్పుడు కొత్త సామ్యాలతో మళ్ళీ మనోయవనిక ముందు మెరుస్తుంటాయే! ఎందుకనలా?

కుసుమశరుడి లాగా భావసుందరీ మనసిజ. ఒక్క రుద్రుడికే మన్మథుడు దద్దరిల్లాడు కాని ఏకాదశ రుద్రులెదురైనా భావసుందరి సిగకొస కదలదు. ఏ బంగారిమామ బెంగ పడ్డా, ఏ బిచ్చగత్తె వొరుగులాంటి వడలిపోయిన కాయంతో చింపిరి తలా చిరుగు వలువల్తోనడవలేక నడుస్తూ వీధి వాకిట్లో నిలబడ్డా, మరకతాలు పరిచినట్లున్న పచ్చని ఆకుమళ్ళ గట్ల మీద చేరి అన్నంమూటలు విప్పుకుంటో వర్షాభావం వల్ల వాలు మొహాలు వేసిన వరినారును చూసి కళ్ళు చెమర్చిన అన్నదాత.. నురుగులు కక్కే దేహంతో కష్టాల కావిళ్ళు మోసే కూలన్నమెలిబడ్డ నొసటి రేఖ కంటబడ్డా, దూరంగా ఎక్కడొ ప్రేయసి చూపులో చూపుంచి వినిపించే అతి సుందర నిశ్శబ్ద మందర కాకలీ స్వరం చెవిన బడ్డా.. తళుక్కుమని మెరుస్తుందే.. మానసాంబర వీధిన భావతారా తోరణం.. ఏ సూత్రమాధారమో ఈ వింత పాలపుంత ధారకు?

కవిత్వమంటే ఇన్నిసాధక బాధకాలా? మబ్బుకు దివిటీ పట్టే మెరుపు విద్యంటారే విజ్ఞులు! చూసిన చిత్రం..చేసిన భావం మాటల్లోనో..మనసుల్లోనో భద్రం చేసి సమయం చూసి సూటిగా లక్ష్యాన్నిచేదించటమంటే మరి మాటలా? కలానికి కాలానికి కట్టుబడెలా ఉంటుందీ తత్వం? అలుగులు పారే సజీవకళతో ఉరకలు ఎత్తే నిత్యచైతన్య ప్రవాహోత్శి కదా కవిత్వం! ‘నదీనాం సాగరో గతిః’ చందంగా పొర్లుకొచ్చే భావవాహినికి ఆనకట్టలు కట్టి పంటకాలువలు తీసి పూలూ పండ్లూ పెంచి లోకానికా జీవప్రసాదం పంచే వనమాలి కదూ కవి! ఉచ్చృంబలంగా సాగే జీవప్రవాహం ఏ కొండో బండో అడ్డగిస్తే.. వెనక్కి మళ్ళటమో..ఉబికుబికి ముందుకు ఉరకటమో..ఏ లోయో సంప్రాప్తమైతే హడిలి అంతెత్తు పైనుంచీ మోతలు పెట్టుకుంటో పాటుగా దూకి పడి ముందుకు సాగటమో..ఏ వంపులో, ముంపులో తగిలినప్పుడు తల ప్రాణం తోకకొచ్చినట్లు సుళ్ళు తిరిగి ఊగటమో!కవిత్వ తత్వమూ అదేనేమో! కవి జీవన యానంలో అందమైన విఘాతాలు అప్పటికైతే విస్మృతి లోకెళ్ళి పోయినా.. మనసడుగుపొరల్లోనే ఎక్కడ పడుకుని ఉంటాయో.. వాస్తవ జీవితం ఏ కష్టంతోనో, ఇష్టంతోనో ముష్టియుద్దానికో, ముద్దులాటకో సిద్దమైన క్షణాన.. పునరుజ్జీవం పొంది తెర ముందు కురికొచ్చేస్తుంటాయి.అలా రావడమే అసలు సిసలు కవిత్వతత్వ రహస్యమేమో! మరి రససిద్ధులైన పెద్దలేమంటారో..ఏమో!

(వాకిలి- ఇ-పత్రికలో ప్రచురితం)

అంతస్సారం- కవిసంగమం- ఇ-పత్రిక వారు కోరిన మీదట రాసిన వ్యాసం

 

అంతస్సారం

కవిసంగమం- ఇ-పత్రిక వారు కోరిన మీదట రాసిన వ్యాసం ఇది

ఒకసారి  బీజంపడితేచాలుకాల్చిందాకాకవినివదిలిపోనినైజంకవిత్వానిది. కవిత్వంఅబద్ధంకావచ్చేమోకానీ…అదిచేసేగాయంమాత్రంపచ్చినిజం. నిద్రపోనివ్వదు. మెలుకువగాఉండనీయదు. అదోరకమైనఅర్థస్వప్నజాగృతావస్థ. అనుభవించేవారికేతెలిసేఅవస్థ.   ఇకభాషందామా.. ప్రతీకలు, పరోక్షసూచనలు.. పీకల్దాకామునిగిపోయినపిల్లకాయల  తొలిప్రేమతంతేఅంతా.  రోణంకిఅప్పలస్వామిగారినిఓసారిఎవరోకుర్రాడుకవిత్వంరాయాలంటేఏంచెయ్యాలోచెప్పమనిసలహాఅడిగితే  ఎవర్నయినాపిల్లనుచూసిప్రేమించేసెయ్‌’అని   పెంకిసలహాఇచ్చార్ట. ‘ప్రేమిస్తేజ్వరమొస్తుందికానీకవిత్వమెందుకొస్తుందా? అనికదాసందేహం? వస్తుంది. అమ్మాయికనిష్టంగాసినీస్టారంతందంగానైనావుండుంటుందికదా!  తెలివైనదీఐవుంటుందేమోకూడా! ఇన్నీవుంటే, తనని  నువ్వొక్కడివేఎందుకుతగులుకుంటావ్! ఇంకోవందో   రెండొందలమందిమందో  క్యూలోతగలడుంటారుకదా! వాళ్ళందరూవట్టిదొంగసన్నాసులనీ.. నువ్వొక్కడివేశ్రీరామచంద్రుడిపక్కింటి  పెద్దాసామివనీ  నమ్మించటానికినువ్వూఏవేవో  తంటాలుపడతావ్!  మంచానపడతావ్! నీదినిఝమైనప్రేమకాబట్టి  రాత్రీ, పగలూ..తిండీతిప్పలూ..నిద్రానిప్పులూలేకుండా  తనగురించేనలిగిపోతో.. నరకయాతనపడుతోవంటిమీదకుచలిజ్వరంకూడాతెచ్చేసుకుంటావ్. వణుకునూ..వేదన్నంతాపొల్లుపోకుండాకాగితంమీదకనకపెట్టిచూసుకున్నావనుకో..అదేకృష్ణపక్షమైకూర్చుంటుంది. ..నువ్వోఅభినవకృష్ణశాస్త్రివైపోతావ్అన్నార్టపెద్దాయన. సరదాసంఘటన్నిఇంకొద్దిసీరియస్గాతీసుకుంటేకవిత్వంఅంతస్సారంకొంతైనా  తలకెక్కుతుంది.  ప్రేమించేపిల్లస్థానంలోకి.. ప్రపంచమొచ్చిందనుకోండి.. శ్రీశ్రీ.  వైరాగ్యమొస్తేవేమన.  కవిత్వంనాకుకన్నుమూతపడనిజ్వరం/ .. ఒక్కకవితావాక్యం/ గుండెలోతుల్లోంచి/ పెల్లుబికిరావాలంటే/ ఎన్నిరాత్రులనిద్రనితాకట్టుపెట్టాలో”/ అనికవిరాధేయవూరికేఅంటాడంటారా! నిజమేగా!

అంతస్సారం-2

కవిహృదయంఉన్నవాడుఒకఉన్నతమైనమానసికస్థితిలోఉన్నప్పుడువెలికొచ్చేదంతాకవిత్వమే..పోండి!’ – అనాట్ట   కోల్రెడ్జ్.  నన్నపార్యునినుంచీశ్రీనివాసాచార్యులదాకా..ఎంతోమందిఇంతకుముందేఉన్నతమైనమానసికస్థితిఅంతేదోచుడాలని   ఎంతోప్రయాస  పడ్డారు.. పడుతున్నారు.  ఇంట్రస్టంటూఉండాలేకానీఇంటర్నెట్లో.. అరిస్టాటిల్నుంచీఅద్దేపల్లివారివరకు.. ‘ఫ్రంశామ్యుల్జాన్సన్టుఎడ్గార్ఏలన్పోఅంతస్సారాన్నిఅరటిపండులావలిచినోట్లో  పెట్టేందుకుమౌస్క్లిక్దూరంలో  మనకూరెడీ. సాదీమహాకవిజ్ఞానవంతులకుపచ్చనిచెట్టుప్రతిపత్రం  ఒక్కోజ్ఞానక్షేత్రమేఅంటారు.   కవికిసరిగ్గాఅతికినట్లుసరిపోయేఅతిగొప్పనిర్వచనమది. చెట్టుకవిఇస్మాయిల్  భాషలోచెప్పాలంటే   తెరుచుకొన్నపద్యాలనుకూర్చేవాడేఅచ్చమైనకవి.

 సెలయేరాసెలయేరా

గలగలమంటోనిత్యం

ఎలాపాడగలుగుతున్నావు?’

చూడు, నాబతుకునిండారాళ్లు

పాడకుంటేఎలా?’

 ఇదిఇస్మాయిల్కవిత.

ఇందులోలాముగింపు  పాఠకుడిమనసు  కొనసాగింపుగాఐతేనేకవితకైనా  ఇంపూసొంపు. ” ‘రూపం..భాష‘- లాంటి చర్చ  ఆనక.. మంచికవిత్వంరాయాలంటే  ముందుజీవితాన్నిగాఢంగాప్రేమిచాలిఅంటారుగుంటూరుశేషేంద్రశర్మ.

నాఅక్షరాలుకన్నీటిజడులలోతడిసేదయాపారావతాలు/

నాఅక్షరాలుప్రజాశక్తులవహించేవిజయఐరావతాలు/

నాఅక్షరాలువెన్నెలలోఆడుకునేఅందమైనఆడపిల్లలు

అనిసంకల్పంచెప్పుకోబట్టే  తిలక్అంతమంచికవితలుఅల్లగలిగాడేమో!

చూసేకళ్ళుండాలేకానీచుట్టూతాబృందావనమేఅనికవిజ్ఞానేశ్వర్బోధ.  అట్లతదియపండగకివయసులోఉన్నఆడపిల్లలుఊరిబయటతోటల్లో  మోకుల్తోఉయ్యాలలేసుకొనిఅట్లతద్దోయ్ఆరట్లోయ్, ముద్దపప్పోయ్మూడట్లోయ్’అనిపాడుకుంటూ  పోటాపోటీగాఊగేఆచారంఒకప్పుడుమన  పల్లెపట్టుల్లోబాగాప్రచారంలోఉండేది. మామూలుకంటికదిమనోహరదృశ్యంమాత్రమేకావచ్చు పింగళి సూరన లాంటిరసపిపాసికంటికి   కొమరుంబ్రాయపుగబ్బిగుబ్బెతలయంఘ్రుల్చక్కగాజాగిమిం/టిమొగంబైచనుదెంచుఠీవి. ‘కళాపూర్ణోదయం  రాస్తున్నప్పుడు  సందర్భంచూసుకుని     వయసులోఉన్నఅందమైనఆడపిల్లలు  అలాకాళ్ళుఆకాశంవైపుబారలుచాస్తూపైకిలేపటాన్ని   స్వర్గధామంలోని   దేవతాస్త్రీలమీదచేసేయుద్ధంగాఉత్ప్రేక్షించి  రసహృదయాలకుచక్కలిగింతలుపెట్టేసాడుకవి. అన్వేషించేఆసక్తిఉండాలేకానీమనమానసాంతరాలనుకాంతివంతంచేసే  మణిమాణిక్యాలువిశ్వసాహిత్యంలో   బోలెడన్ని. కన్నవారికి, కట్టుకున్నదానికిమనస్తాపంకలిస్తున్నాడనికబురంది..పుట్టింటివ్యవహారాలుచక్కబెట్టేందుకని  వచ్చినఅక్కగారు..చెట్టంత  తమ్ముడిని..నేరుగానిలదీయలేకఏరాతమ్ముడ! నన్నుజూడజనుదేవెన్నాళ్ళనోయుండి/క్షూరాజీవయుగంబువాచెనినుగన్కోకుంకి  అంటోగడుసుగాయోగక్షేమాలారంభించినకథతెనాలిరామకృష్ణునిపాండురంగమాహాత్మ్యంనిగమశర్మోపాఖ్యానంలోఉంది. ఇన్నేళ్ళుగడిచినామనమింకాపద్యాలనేతలుచుకునిమురుస్తున్నామంటే..కవిఅక్కపాత్రకిఆపాదించిన  ఆప్యాయతలేముఖ్యకారణం. కథలుకల్పితాలేఐనా..కవిస్వరంలోనిజీవంకొన్నిపాత్రలగొంతుల్లోఅలాఅమృతంపోసేస్తుంది.  గోవైనా..గడ్డిపూవైనా..  అనంతామాత్యుడో, రాయప్రోలో  పూనుకుంటే.. ఇదిగో..ఇలాగా..మనప్రస్తావనల్లోనిత్యస్మరణులౌతాయి. కల్హణుడుఅందుకే  కవిగొప్పతనాన్నిశ్లాఘిస్తోచక్కనిశ్లోకంచెప్పాడు. ‘కో~న్యఃకాలమతిక్రాంతంనేతుంప్రత్యక్షతాంక్షమఃకవిప్రజాపతీన్  త్యక్త్వారమ్యనిర్మాణశాలినః‘-రమ్యనిర్మాణసమర్థులుకవిబ్రహ్మలుకాకఅతిక్రమించినకాలాన్నిదృష్టిగోచరంకావించేసమర్థులింకెవరు?..అనిశ్లోకార్థం. సత్కవుల  అనుగ్రహం  సన్నగిల్లితే  సకలైశ్వర్యాలనుభవించేసామ్రాట్టులైనా  కాలందృష్టిలో  వట్టిచట్టుబండలే. వాల్మీకిచేతిచలవవల్లేరాముడు  దేవుడయ్యాడు.  కవులెంతభాగ్యవంతులోచెబుతూఇస్మాయిల్అంటారూ.. ‘కిటికీలోంచివాలిటేబుల్పైపుస్తకాన్ని, పెన్నునిఇంకుస్టాండునిమంత్రించేసూర్యకిరణంఖరీదెంత! కవికిమాత్రమేదొరికేప్రాకృతిక  అనుభవానందసంపద  ఎంతెత్తు  ధనరాసిధారపోస్తేజడ్డికిలభిస్తుంది!’-అని. నిజమే. కవిత్వానికికాసుతోనిమిత్తంలేదు. ధనమేప్రధానమనుకునేవారినికవిత్వంకనికరించదు.  నిధిచాలసుఖమా..రామునిసన్నిధిచాలసుఖమాఅన్నప్రశ్నఎదురైనప్పుడుత్యాగయ్యలాగాకవితారాముణ్ణిచేరతీసినవారినే  కాలం  కీర్తికిరీటంతోసత్కరించేది.  అక్కయ్యకురెండోకానుపు/తమ్ముడికిమోకాలివాపు/చింతపండుధరహెచ్చింది/చిన్నాన్నకుమతిభ్రమించింది‘- అనినిద్రలేచినక్షణంనుంచీగోరుచుట్టలాసలిపేఈతిబాధలుసామాన్యుణ్ణెప్పుడూసతాయించేవే! ఏడుపుఎలాగూతప్పదనితెలిసినప్పుడు..వెక్కిళ్ళమధ్యలోనే  కృష్ణశాస్త్రిలాగానో  నానివాసమ్ముతొలుతగంధర్వలోక/ మధురసుషమాసుధాగానమంజువాటిఅంటూ  రెక్కలువిప్పుకుని  ఎగిరిపోవటంమొదటిమార్గం. విన్నకోటఅనేనేటికవిచెప్పినట్లు  దేహంవిల్లుకిప్రాణాన్నిసంధించిలాగినట్లు/మరుక్షణంలోమరణావరణాన్నిదాటబోతుండగా/ పక్కింటివాడికివ్వాల్సినచేబదులుగుర్తొచ్చి/ వార్నీఅనుకుంటూవెందిరిగినడిచివచ్చేలౌకికమార్గంరెండోది.  రెండూకవితామార్గాలేఐనా..భావకవిలాగాదిగిరానుదిగిరానుదివినుంచిభువికిఅనిమొరాయించటం  పలాయనవాదం. దేశమంటేమట్టికాదోయ్/దేశమంటేమనుషులోయ్అంటోగురజాడవారుచెప్పినగేయంతాలూకు  మనుషులుమనీపర్సులుప్లస్   మనీషులుకాబట్టి.. సందర్భాన్నిబట్టి    రాజీబడి  ఆకులందుఅణగిమణగిన/కవితకోకిలలాగాకూయటంఉత్తమకవిలక్షణం. అల్లసానివారికిమల్లేనిరుపహతిస్థలంబురమణీప్రియదూతికతెచ్చియిచ్చు/ప్పురవిడెమాత్మకింపయినభోజనముయ్యెలమంచంలాంటిగొంతెమ్మకోర్కెలుపెట్టుకోకుండాగుండెగొంతుకలోనకొట్లాడినప్పుడుమాత్రమేచప్పుడుచేయడం  మంచికవిలక్షణం. అలాగనినువ్వు/నన్నుచూసి/అలానవ్వుతూనేఉండు/నీగుండెల్లోఎప్పుడో/గోలీవేస్తాను/నాపదకవితల/రంగోలీవేస్తానుఅనిరాసేసిజంధ్యాలసినిమాలోశ్రీలక్ష్మిలాగానేనుకవినికాదన్నావాణ్ణికత్తితోపొడుస్తా!’అంటోబాకుబోడ్లోదోపుకునితిరగడమూ   క్షేమంకాదు.

 అసలేకవిత్వంసోమరులసత్రమనీ, సత్రంలోకవిత్వంనల్లమందు  కొల్లలుకొల్లలుగా  దొరుకుతుందని.. తదౌషధ  మాహాత్మ్యంవల్లమాడినపోపుఘాటుటైపుఊపిరిసలపని   తుమ్ముల్లా   కవిపుంగవుల  కలాల్నుంచీ  కవిత్వమలాపొంగిపొర్లివాతావరణమంతాకంగాళీకాలుష్యమయమైపోతోందనికొంతమందికళాఅవిద్వేషుల   కలవరం.   శతావధానివేంకటశాస్త్రిగారికథలూగాథలేసాక్ష్యమనిబుకాయింపుకూడాను.  కానిఅవధానిగారే  అనారోగ్యంతో  ఆసుపత్రిలోపడున్నప్పుడువైద్యులెంతవద్దని  వారిస్తున్నా    కట్టిపెట్టలేకపోయారేకవితావ్యాసంగాన్ని!  లోపల్నుంచిఇది(కవిత్వం) బైటికిపోకపోతేబాధమీకేంతెలుసునర్రా!’ అంటోఆయనపెట్టినగగ్గోలుపొయిట్రీకున్నడిసెంట్రీ  పవరేంటోతెలియచేస్తుంది. తెలుగువాళ్ళచేతఆస్కారు  చిత్రాలుతీయించటమెంత  అప్ఫిల్టాస్కో‘..తెలుగునాటకవిత్వాన్నికట్టడిచేయడం  అంతకన్నారిస్క్. కవితాద్వేషులుహాలునికాలంనుంచీఅలాహాహాకారాలుచేస్తూనేఉన్నారుకానీ.. వాళ్ళగగ్గోల్లోకూడాగోళీకాయంతైనాసత్యమేమైనాఉందేమో..కాస్తఔత్సాహికకవులూఅంతశ్శోధనచేసుకోవడంశ్రేయస్కరం.’హింసనచణ/ధ్వంసరచనఎవరికీమంచిదికాదు. ‘కదిలేది.. కదిలించేది.. మునుముందుకుసాగించేది..పెనునిద్దరవదిలించేది..’అనిఅన్నాడుకానీ..’బాధతోపెడబొబ్బలుపెట్టించేదీ..భయంతోపరుగులుపెట్టించేదినవకవితాలక్షణమనిమహాకవికూడా  ఎక్కడాఅన్నట్లు  గుర్తులేదు. తననుకలిసిన  అభిమానులుకొందరుకవితచెప్పమనివత్తిడిచేస్తే..తట్టుకోలేని  మహాకవేఎప్పుడుపడితేఅప్పుడు   కవిత్వంచెప్పడం  ఎంతటి  ఇబ్బందోఅప్పటికప్పుడు   ఆశువుగాకవితలోచెప్పుకొచ్చారు. ‘కవనానికీవచనానికీనడుమగల/సరిహద్దులుచెరిగిపోయినఈనాడు/శబ్దాన్నినిశ్శబ్దంతోతర్జుమాచెయ్యగల/శక్తివంతమైనయంత్రాలున్నఈనాడు/శవత్వంపాశవత్వంపెరిగి/నవత్వంతరిగి/దానవత్వంసర్వత్రా/దంష్ట్రలుకొరుకుతున్ననేడు/యువత్వంవెనుకంజవేస్తున్నరోజున/కవిత్వంచెప్పడమంటేమజాకాలా?’ అంటో. మహాకవిగారినేముప్పతిప్పలుపెట్టించినకవితామతల్లిమీదిహ

హాస్యాలు  మానేసిఒకసారిటుకేసిసీరియస్గాపరికిద్దాం. రవివీరెల్లి  దూపకవితాసంకలనంఎదురుచూపు’లోకవిత్వాన్నిగురించిచెప్పినమూడుమంచిముక్కలతోఇకముగిద్దాం.

నీతలపు

ఎక్కడోపచ్చికబయల్లోపారేసుకున్నమన

పాతగురుతులని

ఎదకుఎరగావేసిపదపదమనిపరుగుపెట్టిస్తుంది

నీధ్యాస

స్మృతులశ్రుతిలోస్వరాలాపనచేస్తున్ననా

హృదయలయను

గమకాలఅంచుల్లోతమకాలఉయ్యాలలూపుతుంది

నీఊహ

మొగ్గలాముడుచుకున్నజ్ఞాపకాలనిబుగ్గరించి

విరబూయించి

అనుభవాలరెక్కలచిరుజల్లుగాచిలకరిస్తుంది

ఒకభావోద్వేగంలోపుట్టినపదాలు..కొన్నాళ్ళాగినతరువాతా..కవినిమళ్ళీఅదేఎమోషనల్ప్లేన్లోకిమళ్ళించగలిగితేనే  ..అదిఅసలైనకవిత్వానికిగీటురాయిఅనిపెద్దలఉవాచ. మరందుకేఒకకన్నీటికణంబరువుకిచిగురుటాకులాఒదిగిపోయిప్రపంచదుఃఖాన్నంతాఅట్లాస్లాభుజాలకెత్తుకోగలిగే  దాకామనమూమనఅక్షరాలకుమనమానసాంతరంగభావవ్యాయామశాలలోశిక్షణఇప్పిస్తూనేఉందాం!

స్వస్తి

శివం-సుందరం-సత్యం -పాలగుమ్మి పద్మరాజు గారి ‘అప్పుడు’

పైరుగాలికి నాట్యమాడే
పైటరాపిడి తగిలి చిటుకున
పండిపోయిన దానిమ్మొకటి
పగిలి విచ్చింది
పండుదొండకు సాటివచ్చే
పడతిపెదవులలోన దాగిన
పండ్లముత్తెపుపుతళుకు లన్నీ
పక్కుమన్నాయి.

అప్పుడు నెననుకున్నాను
అందానికి కర్థం ఇదే నని.

గట్లమీదా పుట్లమీదా
గంతులేస్తూ తిరిగివచ్చిన
కోడెదూడని బాడి అయినా
గోవు నాకింది
దుస్తులంతా దుమ్ముపడినా
దులపకుండా చేరవచ్చిన
కన్నతండ్రిని తల్లి ఎత్తుకు
కౌగలించింది.

అప్పుడు నేననుకున్నాను
ఆనంద మంటే ఇదే నని.

తేనె కోసం పూవుపూవుకి
తిరుగుతుండే గండుతుమ్మెద
కాలికంటిన పుప్పొడంతా
పూల కంటింది.
పూటపూటకు సేకరించిన
పూరజంతో బరువులెక్కిన
విరులగుత్తులు పురుడుపోసుకు
పిందెలయినాయి.

అప్పుదు నే ననుకున్నాను
అచ్చపుసత్యం ఇదే నని.

పాడుపొట్ట!

పాడు పొట్ట!

ఎవరితోనైనా పోరాడతా.
దేన్నైనా లేదని బుకాయిస్తా
మోసం చేయడం మంచినీళ్ళ ప్రాయం సుమా నాకు!

కానీ..
ఈ పాడు పొట్ట ఉంది చూసారూ..
దీంతోనే అసలు చిక్కంతా!
దీన్ని జయించలేక పోతున్నా!

ఎప్పుడు అడిగితే అప్పుడు ..
ఎంత కోరితే అంత..
దాని ముఖాన కొట్టందే అస్సలు తృప్తి పడందే!
అరే…!
నా గొరవ మర్యాదలతో బొత్తిగా సంబంధముండదా
పాడు పొట్టకి!

హారి..దేవుడా!!-కొడాలి ఆంజనేయులు

గణ గణ మోగే
గంటల చప్పుడు
మిథ్యా దైవము
మేలు కొల్పునా!

విప్రులు చదివే
వేదపు పనసలు
రాతి బొమ్మలను
రంజిస్తయ్యా!

భక్తులు చేసే
భజనల మోతకు
శిల కాకుంటే
చెవుడు పుట్టదా!

అతని పేరుతో
అయ్యే హత్యల
కస లత డుంటే
హడిలి పోవడా!

మతము పిచ్చతో
మానవ లోకం
మురుగెత్తించే
మొద్దా దైవం?

-కొడాలి ఆంజనేయులు

ఎవరన్నారండీ..పాత అంతా చెత్త అనీ!

మొదట శుల్కాలయమ్మునయందు జన్మీంచి, పిమ్మట శిల్పి గేహమ్ము జేరి

పౌరాణిలతోడ భాషించి స్వర్ణకారుని యింటి కేగి భోజనము చేసి
అటనుండి మరలి కోమటివీధి కేతెంచి పిదప బ్లీడరులతో వియ్యమంది
కరణాల జ్యోతిష్కవరులను నుతియించి, కవివరేణ్యుల బ్రీతి గొగలించి
వైద్యులను జూదరులను వహ్వా! యటంచు వారకాంతల జూచి యవ్వారి మాయ

నేరువ దలంచినదివోలె వారియింట గాపురమ్ముండెనట మృషాకాంత! వింత!

!-(పండిత పురాణం సూర్యనారాయణ తీర్థులు గారి చాటువు)

మృష= అసంబధ్ధత

అని తెలుసుకుంటేనే కానీ ఈ చాటువు వ్యంగ్య స్వారస్యం బొధ పడదు-

ఎవరన్నారండీ..పాత అంతా చెత్త అనీ!

మహా..బాగుంది

 

మహా..బాగుంది

కర్లపాలెం హనుమంతరావు

బాల పాపలలోని లీలా వికాసాలను

కర్మయోగము చేత కాంచి కాంచి,

యోగ ముద్ర ఉద్వృత్తి రాగులైన భోగుల

తర్క సిధ్ధాంతాలను తరిచి తరిచి,

మాటిమాటికి మరులు చాటే తేటులపాట

తేట లోపలి నిగ్గు తీసి తీసి,

అబ్జజాండము మొదలు అణువుదాక కనగలుగు

వేదాంతమార్గములను వెతికి వెతికి,

ప్రకృతి, సృష్టి, అంతస్సార రహస్యాలను

వెలికి తీసినా కాని అంతుబట్టని వింతలు కొన్ని.

రాతిలో కప్పకు మేత వేసిన చేత

పసువులకు కసువులో విషము పెట్టుట ఏల?

కారు మేఘాలలో కానాలనంబుంచి

ఫణిశిరమునందు మణి నమర్చుటేమి లీల?

రమకు లుబ్ధునితో కాపురము చేయించు!

పద్మాలయములో షట్పదముల భోజనముంచు!

కడు దురాత్ముడై రావణుడు కష్టపడెనందుమన్న

రాముడేల పన్నమందె?

చెడు సుయోధనుడె పెన్మడుగున పడెనటన్న

ధర్మజుడడవుల ఏల కుందె?

మతి లేకయె వాలి దుర్గతుల పాలవుటయన్న

సుగ్రీవుడ ద్రిలో ఏల కుంగె?

రాకాసితనము వలనె అల్ల శూర్పణఖా టెంకెజెల్లలన్న

పరమసాథ్వీమ లలన సీతమ్మకేల లంక కాన?

పాపులని భక్తులని భేధ మేముంది?

అంతుపట్టని లీల ఇది మహా..బాగుంది!

భక్త ముని జన హృద్వాస పరమపురుషా

గారడీవాడి ఇంద్రజాలము గతి

నాటకము చేసి నడుపుటేలనో జగతి?

 

 

కాస్మాపాలిటన్- బాలగంగాధర తిలక్

 

నాకు బాగా ఇష్తమైన కవి బాల గంగాధర్ తిలక్-రాసిన బాగా ఇష్టమైన కవిత

రష్యాలో రివిజనిస్టు వోడ్కా సిప్ చేసి
చైనాలో రివల్యూనిస్ట్ సప్పర్ భోంచేసి
అమెరికా హాలీవుడ్ తారాపథాల మీద చక్కర్ కొట్టి
టోక్యోలో గైషా యోషాధరాల టేస్టు చూసి
స్పెయిన్ లో రెయిన్ లో తడిసి
ఇరాన్ లో కొరాన్ చదివి
ఈ రోజునే ఇండియా విచ్చేశారు వీరు
కాస్మోపాలిటన్ బోర్ వీరి మారు పేరు

శంకరుడూ సాంతాయనుడూ వీరి ఫింగర్ టిప్ప్సు మీద

కారల్ మార్క్సూ కిర్కు గార్డూ వీరి హృదంతరాళంలో
బిటిల్సు బీట్నిక్సూ వీరి జిహ్వాగ్రం మీద
ఆరెంజ్ ఫ్రీస్టేట్ లో వీరు ఉపన్యాసం చెసారు
అరిజోనాలో సత్యాగ్రహం చేసారు
వన్ వరల్డు రాస్తూ వెండెల్ విల్కీ వీరిని సంప్రతించారు
ఆస్త్రేలియన్ ఎబోరిజన్సు మిదా నెస్సెటీ ఆఫ్ అబోర్షన్సు మీదా
కలిపి ఒకే ఒక ఉద్గ్రంథం రచించారు
గాంధీకీ గాడ్సేకీ దాన్ని అంకితం ఇచ్చారు

మొదటి భార్య నీయన వదిలేశారు
రెండో ఆవిడ యీయన్ని తగిలేసింది
మూడొ పెళ్ళాం కోసం మొనాకో పేపర్లో ప్రకటించారు

ఫ్లిట్ స్త్రీట్ లో ఫస్టుషోలో వీరి మాట వేద వాక్కు
స్త్రీప్ టీజ్ లో ఫస్టు షోలో వీరికి జన్మ హక్కు
పారిస్ లో కవితనీ షాంపెన్ నీ కలిసి సేవించారు
ఫ్లారెన్సు లో యువతినీ ప్రక్రుతినీ కలిపి అనుభవించారు
ఫ్రేలాన్స్ జర్నలిస్టు వార్ కరెస్పాండెంట్ వెంట్రిలోక్విస్టు
వీరు చూదని దేశం లేదు పొందని అనుభవం లేదు

అణుధూమం వంటి వీరి జీనియస్ భవిష్యత్తులో
అరవై శతాబ్దాల మీదకి కమ్ముకుంది
సకల సిద్ధాంతాలూ మతాలూ యిజాలూ సైంటిఫిక్ నిజాలూ
అన్నీ కలబోసి ఒకే రహస్యం కనుగొన్నారు
దాన్నే తన మరణానంతరం ఎపిటాఫ్ గా ఎన్నుకున్నారు

దేవుడూ మానవుడూ వీరిద్దరే యీ అనంత విశ్వంలో మూర్ఖులు
ఏ కోణం నుంచి చుసినా వీరిద్దరూ మిజరబుల్ ఫయిల్యూర్స్
(జ్యోతి-మాస పత్రిక-1966-jUlai సంచిక నుంచి)

ప్రపంచ పక్షి -పొద్దులో నా కవిత

 

గత డిసెంబర్లో పొద్దు అంతర్జాల మాస పత్రికలో ప్రచురించ బడిన నా కవిత ఇది.
చదివి మీ స్పందనను ఆ పత్రికముఖంగానే తెలియచేయమని మనవి.

ప్రపంచ పక్షి
కర్లపాలెం హనుమంతరావు,24-12-2010

సృష్టి నాటి నుంచి చూస్తున్నా
సూర్యుడెప్పుడూ తూర్పునే ఉదయిస్తున్నాడు
దశాబ్దాలనీ శతాబ్దాలనీ
గుర్తుల కోసం నువ్వే ఋతువుల పేర్లైనా పెట్టుకో
కాలం మాత్రం అనంతం నుంచి అనంతంలోకి
సాగే జీవన ప్రవాహం
మనిషి అందులో ఒక అల

నదులూ , సముద్రాలూ, పర్వతాలూ,
అగాధాలూ, అడవులూ, ఎడారులూ,
మహా సముద్రాలనీ
నేలనీ, నీటినీ ముక్కలు ముక్కలు చేస్తున్నావ్!

జాతులనీ, రంగులనీ, మతాలనీ , కులాలనీ,
బానిసలనీ,
నిన్ను నీవే నిలువుగా, అడ్డంగా
నరుక్కుంటున్నావ్!

నిజమే….
నడక మాత్రమే తెలిసినవాడివి- నదులు
నీకడ్డమే మరి!

శతాబ్దానికవతల ఏముందో వినలేని
చెవిటి వాడివి
కంటికి కనిపించనిదంతా నీకు దగా!
నీ గుళ్ళూ, గోపురాలూ, పిరమిడ్లూ, ప్యాలెస్ లూ
నగరాలూ, నాగరికతలూ
కాలం తీరాల వెంట శిధిలాల్లా పడి ఉన్నాయ్!

నత్త గుల్లలే నీ చరిత్రకు గుర్తులుగా మిగిలున్నాయ్!
అణువును ఛేదించి అస్త్రాలను చేసేవాడా
జీవాన్ని మమ్మీ గా మార్చి పిరమిడ్ బొడ్డులో దాచేస్తావా?
కరువులూ, కాటకాలూ, వరదలూ, తుఫానులూ,
భూకంపాలూ, సునామీలు చాలకా …
మధ్యలో పుట్టి మధ్యలో పోయే ఓ మనిషీ!
మళ్ళీ యుద్ధాలను సృష్టిస్తున్నావ్!

నీ అధికారం, ఉగ్రవాదం, యు యెన్ వో వీటో పవరూ,
ప్రభుత్వాలూ, పహరాలూ డాలర్లు పేటెంట్లు
అణువుపగిలితే అంతా మసి!
విశ్వాన్ని జయించాలని విర్రవీగిన నియంతలు
బాత్రూముల్లో జారిపడి చచ్చిన ఉదంతాలు
వినలేదా!

క్యాలెండరుకు ముందేముందో తెలీనివాడివి
నీ కన్న పిట్ట నయం!
చినుకు కోసం నేలపడే తపన దానికి తెలుసు
ఉనికి కోసం జీవిపడే ఆరాటం తను చూడగలదు

తల్లడిల్లే పిల్లవాడు తల్లి నాలుకతో ‘అమ్మా!’
అనే ఏడుస్తాడు ఏ ఖండంలోనైనా
తల్లి నాలుకలు వేరైనా తల్లి మాత్రం ఒక్కటే
బాధలకూ, భయాలకూ రంగులు వేరైనా వాసన ఒక్కటే అయినట్లు
జపానుకైనా ఇరానుకైనా
చెక్కిళ్ళ మీద జారే కన్నీళ్లు ఎప్పుడూ ఉప్పగానే ఉంటాయి

ఆఫ్రికా అడవులైనా, అలప్స్ కొండలైనా,
నైలునది నీళ్ళయినా, దార్ ఎడారి ఇసుకైనా
ఎవరెస్టు శిఖరమైనా మృత్యులోయ లోతైనా
పిట్ట కొక్కటే!

మనిషి ముక్కలు చేసిన ఆకాశాన్ని
తన రెక్కలతో కుట్టుకుంటూ
రవ్వంత వసంతం కోసం దిగంతాల అంచుల దాకా
ఎగరటమే దానికి తెలుసు

నేను
అలుపెరగని ఆ వలసపక్షిని
ప్రపంచ పక్షిని

ఖండాల జెండాలన్నీ ఒక్కటేనని మనిషి
నమ్మేదాకా దేశదేశాలకు
ఈ సందేశాన్ని పంచటమే నా పని!

http://poddu.net/?q=node/783

(పొద్దు అంతర్జాల పత్రికకు కృతజ్ఞతలతో )