పచ్చటి గుట్ట -కాదు పచ్చ నోట్ల కట్ట!- అన్నవరం దేవేందర్ కలవర స్వరం

నగరాలలో నాలుగు మెతుకుల కోసం మనం చేసే నిత్య పోరాటం మధ్యలో మన చుట్టూ జరిగే దౌర్జన్యాలను పట్టించుకోనంతగా మనం బండబారి పోయా మన్నమాట  నిజం. కానీ అందరూ ఒకేలా వుండరు కదా! ముఖ్యంగా కవి అన్నవరం దేవేందర్ లాగానయినా కొంత మంది అక్షర శిల్పులు అన్యాయాలను ఎలుగెత్తి చాటే వాళ్లు  మన చుట్టూ ఉంటుంటారు.

తెలుగు భాష పురా వైభవానికి తిరుగులేని సాక్ష్యమయిన  జినవల్లభుని కంద పద్యం , కొన్ని వందల ఏళ్ల క్రిందటి శాసనాలను, కన్నడ ఆదికవి పంపని కాలం నాటి శిల్ప చాతుర్యాన్ని తన కడుపులో పెట్టుకుని ఇంతకాలం చల్లంగా కాచిన బొమ్మల గుట్ట వట్టి గ్రానైట్ రాళ్ల గుట్ట కాదు… ఒక సజీవ సహజ సుందర రాతి వనం. గుప్పెడు పచ్చ నోట్ల కోసం గుట్టుగా ఆ గుట్ట గుండెలలో డైనమోట్లు పేల్చటం ఒక ఘోరం మయితే …చెట్టునీ, పుట్టనీ, రాయినీ, రాప్పనీ, పురుగునీ, పుట్రనీ..ఆరొక్క జీవరాసులూ కలే తిరిగే ఆ మైదానాన్ని ..తాతల కాలం నుంచీ గుంభనగా వున్న గుట్ట తల్లిని చెరబడుతుంటే చప్పుడయినా చేయలేని నిస్సహాయత ఒక శాపం . చేయాలని లేని  మన చేతకానితనం అంతకు మించిన పాపం, నేరం.

ఆ ఆవేదనతో నిండిన  అన్నవరం దేవేందర్ గొంతుకే బొమ్మలగుట్ట గుండె అలజడి.

కనీసం దీన్నయినా  విని  మన పరిసరాలకు జరిగే అన్యాయాలను ఖండిద్దమా! పర్యావరణం మీద జరుగుతున్న   అత్యాచారాలకు స్పందిద్దా మా!

ఈ రోజు ఆంధ్రజ్యోతి దినపత్రిక సాహిత్య పుట”వివిధ” లో కనిపిస్తుంది ఈ కవిత.

కవి తో నేరుగా స్పండించ దలుచుకున్న  వారికి ఇదిగో సెల్ నెంబర్ :9440763479

గుట్ట

 

సుట్టూ పదూర్ల పెట్టు
కండ్ల సలువ ఆ గుట్ట
అరొక్క జీవరాసులు కలె తిరిగే మైదానం
రేగుపరికి బల్సుకు తునికి
పండ్లెన్ని తిన్నా దంగని తీపి
సొరికెలు దోనెలు సొరంగాలు
బండ మీద నిలబడ్డ మహాబండ
నీళ్ల తావుల కాడ గోదల కాళ్ల ముద్రలు
ఎక్కంగ దిగంగ బాటొంటి కన్పించే గురుతులు
కల్మశం కలవని గుండం నీళ్లు
ఏండ్లకేండ్లు ఆవిరి కాని సెలయేర్లు

సుట్టూ పదూర్ల పెట్టు
అందరికీ కండ్ల సొగసు ఆ కనికట్టు

గుట్టంటే- మద్ది పాలకొడిశె ఏప జిలుగు జిట్రేగు
మర్రి మోత్కుల్లు మొలిసి పెరిగిన రాళ్లవనం
గుట్ట ఒక పెద్ద పురా జాడ
గుట్ట సజీవ సౌందర్యవనం
గుట్ట పుట్టుక వెయ్యిల గుట్టల ఏండ్లు
సకల ప్రాణుల పసందైన లోకం
గుట్ట నిండా గుబురుగా పెరిగిన
ముండ్ల చెట్లు పండ్ల చెట్లు మందు చెట్లు
మొగులు నిండా తిరిగే
పూరేల్లు గొర్రెంకలు కొంగలు బుర్కపిట్టలు
గుట్టానందం ఎక్కినోల్లకే తెలుస్తది
ఎక్కినకొద్దీ మొగులును ముద్దిచ్చుకున్నట్టు
కిందికి చూస్తే
చింతాకంత మడికట్లు వరిపొలాలు
అగ్గిపెట్టెల ఇండ్లు దారంపోసల దారులు
నువ్వు గింజలై నడుస్తున్న ఆవుల మందలు

దీన్ని నిగురాన్‌గ చూస్తే
మంచి సుతారి మజుబూత్‌గ కట్టినట్లే అన్పిస్తది
గుట్ట మీది వాన నీళ్లు
సుట్టూ కాలువలు కాలువలుగ పారి
చెర్లు కుంటల దూప తీర్చే ధారలు
గుట్ట సుట్టువార మైలు దూరం దాకా
పొలాలన్నీ జాలు నీళ్ల కాలువలు
బాయిలు బందాలన్నీ కొప్పురం కొప్పురం

పక్కపొన్న గుట్టుంటే
ఊరందరికీ గుట్టంత గుండె ధైర్యం

తాతల కాలం నుంచీ గంభీరంగున్న గుట్టతల్లి
ఇయ్యాల గజగజ వణుకతంది
గుట్ట పచ్చ నోట్ల కట్టైంది
వానికి గుట్ట నిండా పైసలే కన్పిస్తున్నాయి
గుట్ట తల్లిని కైమకైమ కంకర చేస్తున్రు
మెరిసే గ్రైనేట్ రాళ్ల గుట్టలన్నీ
సముద్రం ఆవలి దేశాలకు అమ్ముతున్రు
బొమ్మల గుట్టమీది జినవల్లభుని కందపద్యం
పదకొండు వందల ఏండ్ల శాసన చరిత్ర
కన్నడ ఆదికవి పంపని కాలపు శిల్పం
ఆనాడు గుట్టలే కావ్యాల కాన్వాసులు
అన్ని గుట్టలనూ గులాబ్‌జామూన్‌లా తింటండ్రు
కురిక్యాల పోరండ్ల ఒడ్యారం అన్నారం
నందగిరికోట్ల నేర్జాపురం నెమల్లగుట్ట
అన్నిటినీ దోస వక్కలోలె కోస్తండ్రు

సకల జీవరాసులకు పెట్టనికోట- గుట్ట
అది ఎచ్చ పచ్చని నీడ పర్యావరణ జాడ

– అన్నవరం దేవేందర్

(కరీంనగర్ జిల్లాలో 560 గుట్టలను గ్రైనేట్ క్వారీలకు అనుమతిచ్చిండ్రని తెలిసి..)

ఆంధ్రజ్యోతి కి కృతజ్ఞతలతో

అన్నవరం దేవేందర్ గారికి అభినందనలతో –

కర్లపాలెం హనుమంత రావు

9440361381

గుత్తి వంకాయ కూరోయ్ బావా!-బందా వారి స్వరంలో బసవరాజు గారి పాట

ఇక్కడ నొక్కండి  -…వేరే పేజీ తెరుచుకుంటుంది.
(మాగంటి వారి వెబ్ సైట్ చూస్తున్నప్పుడు నాకీ ఆణిముత్యం దొరికింది.బసవరాజు అప్పారావు గారి ఈ వెర్రి పిల్ల పాట ఆ రోజులలో చాలా ప్రసిద్ధం. బందా కనకలింగేశ్వర రావు గారి విలక్షణమయిన గళం లోనుంచి జాలువారిన ఈ పాట తెలుగు వారి అందరికి గుత్తి వంకాయ కూర ఎంత ఇష్టమో అంత ఇష్టం ఈ తరానికి కూడా ఒక సారి ఆ రుచి చూపించాలనే సదుద్దేశంతోనే ఈ పాటను ఇక్కడ పెట్టటం జరిగింది.నాకు సాంకేతికమయిన అంశాలలో అంతగా అనుభవం లేని కారణం గా పై లంకెను నొక్కగానే వేరే పేజి తెరుచుకునే విధంగా ఏర్పాటు చేశాను .పాటను విని ఆనందించిన తరువాత తిరిగి ఈ పేజీ లోకి వచ్చి మీ స్పందన తెలియచేస్తే నా కృషి ఫలించినదనుకుంటాను.మీ మిత్రులకు ఈ బ్లాగ్ సంగతి చెబితే మరింత సంతోషిస్తాను,
మాగంటి వెబ్ సైట్ వారికి సేకరించిన సేకరించిన డాక్టర్ కారంచేడు గోపాలం గారికి కృతజ్ఞతలు.)

గుత్తి వంకాయ కూరోయ్ బావా!
కోరి వండినానోయ్ బావా!
కూర లోపలా నా వలపంతా
కూరి పెట్టినానోయ్ బావా!
కోరికతో తినవోయ్ బావా!

తియ్యని పాయసమోయ్ బావా!
తీరుగా ఒండానోయ్ బావా!
పాయసమ్ములో నా ప్రేమనియేటి
పాలు పోసినానోయ్ బావా!
బాగని మెచ్చాలోయ్ బావా!

కమ్మని పూరీలోయ్ బావా!
కర కర వేచానోయ్ బావా!
కర కర వేగిన పూరీ లతో నా
నా కాంక్ష వేపినానోయ్ బావా!
కనికరించి తినవోయ్ బావా!

వెన్నెల ఇదిగోనోయ్ బావా!
కన్నుల కింపౌనోయ్ బావా!
వెన్నెలలో నా కన్నె వలపనే
వెన్న కలిపినానోయ్ బావా!
వేగముగా రావోయ్ బావా !

పువ్వుల సెజ్జిదిగో మల్లే
పువ్వులు బరిచిందోయ్ బావా !
పువ్వులలో నా యవ్వనమంతా
పొదివి పెట్టినానోయ్ బావా!
పదవోయ్ పవళింతాం బావా!

-బసవ రాజు అప్పారావు గారు

 

 

http://www.maganti.org/lalitasangitam/audios/guttivankay.html

భూపాలరాగం కర్లపాలెం హనుమంతరావు,

 

భూపాలరాగం

కర్లపాలెంహనుమంతరావు,

(ఒబామా భారత సందర్సనం సందర్భంళో రాసుకున్న కవిత)

ప్రొద్దు-05-10-2010-సంపుటి5 సంచిక4-లో ప్రచురితం

 

భావదాస్యంలోనిద్రపోయినజాతికితప్పిపోయినవెన్నెముకల్నిగుర్తుచేసేభూపాలరాగం.

భూపాలరాగం

కర్లపాలెంహనుమంతరావు,05-10-2010

పురుగుమందుకుమనుషులంటేనేఎందుకోఅంతప్రేమ!

విషంమిథైల్ఐసోసైనేట్మారువేషంలో

నగరంమీదవిరుచుకుపడినచీకటిక్షణాలముందు

హిరోషిమానాగసాకీబాంబుదాడులేకాదు

తొమ్మిదీపదకొండుఉగ్రదాడులుకూడాదిగదుడుపే!

టోపీలవాడిమాయాజాలమంటేఅంతేమరి!

మనకిఊపిరాడదనిమనతలుపుకేకన్నంవేసేకంతిరితనంవాడిది.

అప్పుడెప్పుడోవాస్కోడిగామావచ్చిమిరియంమొక్కఅడిగినా

కంపెనీవాడొచ్చిమూడడుగులనేలడిగినా

మనకళ్ళుకప్పిమాడుమీదవాడిజెండాదిగేయ్యటానికే!

మనకండలుపిసికిపండించిన  పంటనుఓడలకెత్తుకెళ్ళటానికే.

అదిప్పుడుపాతకథ.

కొత్తకథలో..

వామనుడుఅడగకముందే  నెత్తిచూపించేఅమాయకబలిచక్రవర్తులంమనం

భూమినిచాపలాచుట్టివాడిపాదాలముందుపరచటానికి

పోటీలుపడేకలియుగదానకర్ణులం.

మనరూపాయిప్రాణవాయువును

వాడిడాలరుబతుకుతెరువుకోసం

తృణప్రాయంగాసమర్పించుకునే

పిచ్చిబేహారులం

వాడివిమానాలుక్షేమంగాదిగాలని

మనవూళ్ళుకూల్చుకుని

రహదారులువిశాలంగాచేసుకునే

విశాలహృదయులం

వాడినాలికమడతపడటంలేదని

మనమాటనుసంకరంచేసుకునేటందుకయినాసంకోచపడం.

వాడిఅణుదుకాణాలకోసం

మనఅన్నపూర్ణకడుపులోచిచ్చుపెట్టుకోటానికయినామనంసిద్దం.

సార్వభౌమత్వమంటేనేఒకచమత్కారం

డాబుదర్పాలకిమురిసిచప్పట్లుకొట్టటమేమనకుగొప్పతనం.

అణుఒప్పందంవల్లభవిష్యత్తులోజరిగేభారతీయచెర్నోబిల్నాటకానికి

పాతికేళ్ళక్రిందటేప్రారంభమయింది

భూపాలరాగంవింటున్నారా

జనప్రవాహాన్ని చూస్తుంటే… ఏ ఈ హౌజ్మన్, ఇంగ్లండు

జనప్రవాహాన్ని చూస్తుంటే… ఏ ఈ హౌజ్మన్, ఇంగ్లండు

సుఖాలలోఉన్నప్పుడులేనితాత్త్వికచింతననిర్వేదంలోపడినప్పుడుచేయడం..నిజమే..మానవబలహీనతల్లోఒకప్రధానభాగమే. తద్విరుద్ధంగాఇక్కడకవిఒకసంతోషసందర్భంలోఅంతిమమజిలీకావలిలోకాన్నిగురించినచింతనచేయడం..ఓహ్..కవిపరిపక్వతపద్దులో..ఇంతకన్నాపెద్ద.entry ఇంకేముంటుంది? చాలాచక్కటిగీతాన్నిఅంతేచక్కనిపదజాలంతోఅనువదించిన  ప్రజ్ఞా ఇక్కడ గమనించదగ్గ విశేషం.

అద్దెకు దిగిన ఈ లాడ్జిలోంచి
వీధిలో వెచ్చగా ఊపిరులూదుకుంటూ
ఒకరివెనక ఒకరు ఉత్సవ ప్రభల్లా
వెళుతున్న జనసందోహాన్ని చూస్తుంటే…

ప్రేమక్రోధాల ఆవేశాలు నిజంగా
ఈ మాంస గృహంలో బలీయమైనవయితే
నేను శాశ్వతంగా నివసించవలసిన
ఆ మట్టింటి గురించి కాస్త ఆలోచించనీండి.

అగోచరమైన ఆ దేశంకాని దేశంలో
పూర్వఛాయలేవీ అక్కడ మిగిలుండవు
అక్కడ ప్రతీకారాలు మరుగునపడతాయి
ద్వేషించినవాడికి ద్వేషం గుర్తుండదు.

రెండువరుసల్లో నిద్రిస్తున్న ప్రేమికులు
పక్కనున్నవారు ఎవరు అని అడగరు
రాత్రిగడిచిపోతునా, పెళ్ళికొడుకు
పెళ్ళికూతురుదగ్గరకి చేరుకోడు.

.

ఏ ఈ హౌజ్మన్

26 March 1859 – 30 April 1936

ఇంగ్లండు 

.

మరణాంతే వైరం అని మనకి ఒక సామెత ఉంది.  మన భారతీయ చింతన ప్రకారం, మరణానంతరం మృతుడికి ఈ లౌకిక ప్రపంచంలో ఉన్న అన్ని విషయాలతోనూ బంధం తెగిపోతుంది. (అందుకే అర్జంటుగా చట్టం ప్రవేశించింది అక్కడ)  అతని అప్పులూ, ఆస్తులూ, శత్రుమిత్రకళత్రాదులన్నిటితో సహా. ఈ భావనని కవి ఎంత అందంగా చెప్పేడో గమనించండి.  అందుకు ఎన్నుకున్న సందర్భంకూడా చూడాలి. మనకి ఆనందంలో ఉన్నప్పుడు వైరాగ్య స్థితి ఉండదు. మనకి కష్టాలు కమ్ముకున్నప్పుడూ, ముదిమి పైబడ్డప్పుడూ ఎక్కడలేని తాత్త్విక చింతనా బయలుదేరుతుంది. కవి ఎప్పుడూ తాత్త్వికుడు కావాలి అని సూచించడానికా అన్నట్టు, మేడమీదనుండి క్రింద జరుగుతున్న (బహుశా) ఒక కార్నివాల్ చూస్తున్నప్పుడు కవికి, మృత్యువుగురించీ, కామక్రోధాలగురించీ, వాటి నశ్వరత గురించీ ఆలోచన వచ్చి ఉంటుంది. ఆఖరి వాక్యాలు, జాషువాగారి శ్మశానవాటిని తలపిస్తాయి, కొంచెం తేడాతో.      

English: English classical scholar and poet .

English: English classical scholar and poet . (Photo credit: Wikipedia)

When I watch the Living Meet

.

When I watch the living meet,
 And the moving pageant file,
 Warm and breathing through the street
 Where I lodge a little while,

If the heats of hate and lust
 In the flesh of house are strong,
 Let me mind the house of dust
 Where my sojourn shall be long.

In the nation that is not,
 Nothing stands that stood before
 There revenges are forgot,
 And the hater hates no more;

Lovers lying two and two
 Ask not whom they sleep beside,
 And the bridegroom all through night
 Never turns him to the bride.

.

 AE Housman

26 March 1859 – 30 April 1936

English classical scholar and poet

Poem Courtesy:

Twentieth Century Poetry in English, Ed. Michael Schmidt.

 

(https://teluguanuvaadaalu.wordpress.com/2013/04/06/%E0%B0%9C%E0%B0%A8%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B9%E0%B0%BE%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B0%BF-%E0%B0%9A%E0%B1%82%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%81%E0%B0%82%E0%B0%9F%E0%B1%87/#comment-1393)

తడిసిమోపెడైన కథ … కొండేపూడి నిర్మల

తడిసిమోపెడైన కథ … కొండేపూడి నిర్మల

సెంటిమెంట్స్ మనకు కాస్త ఎక్కువే.ముఖ్యంగా అమ్మ అనంగానే అవి లోనుంచీ తన్నుకొస్తాయి అనుకుంటా.యాంగ్ మహాశయుడు చెప్పినట్లు సమిష్టి అవచేతనలో జాతి సంతరించుకునే పురాసంస్కృతి ప్రాగ్రూపాల వర్గ చిహ్నాల ప్రభావం కూడా ఐవుండచ్చేమో!  స్త్రీత్వాన్ని దైవీకరణ చేసి దోపిడీ చేస్తున్న మగసమాజం మీద నిర్మలగారి లాంటి వాస్తవికవాదులు కురిపిస్తున్న నిప్పులు ఇప్పటివి కావు.నొప్పిగా అనిపించినా స్త్రీవాదుల ఫిర్యాదులో అధిక శాతం వాస్తవమే .

 తడిసిమోపెడైన కథ

______________

 మాతృత్వమనేమాట నన్నెందుకో భయపెడుతుంది

మాతృధర్మాన్ని చివరంటా కొనసాగించలేనేమో నన్న భీతి

నన్నెంతో ఓటమికి గురిచేస్తుంది

మాతృమూర్తివంటూ నా పిల్లలుపాడుతున్న కావ్యగానం

నన్నెంతోభ్రమపెడుతుంది.

వాంతులూ, విషజ్వరాలూ,ఉచ్చగుడ్డలూ,ఉడికించాల్సిన పాలపీకలూ

వెరసి భరించాల్సిన ఒంటరి బాధ్యత

కిటకిట్లాడే మనుషుల మధ్య నా ఏకాకితనాన్ని ఖరారుచేస్తుంది

అవసానదశలో మాతృమూర్తులకు జరుగుతున్న ఆదరణ

నన్నెంతో దివాలకోరును చేస్తుంది

ఎందుకు బాధిస్తారు చెప్పండి

అమ్మ మీద నాలుగుముక్కలు అందంగా కతకాలంటే

తలమీద చుక్కలతికిన దిగజారుడుబండల్ని ఎలాగోలా ఎక్కాలంటే

ఆ బాధెలాంటిదో అమ్మకపుకవిత్వం రాస్తున్నవాళ్లకి అర్థం కాకపోవచ్చు

కనడంలో స్వేఛ్చలేనిదాన్ని

కంటున్నలింగాన్ని నిర్ధారించకతప్పనిదాన్ని

కనాల్సిన ప్రసూతినరకాల సంఖ్యను నిర్ణయించలేనిదాన్ని

అరిగిపోయిన నవ్వుతో, నెత్తుటిచెమటతో నేలరాలిన కన్నీళ్లతో

తడిసిమోపెడైన కథల్ని వజవజలాడుతూ

యిలా కప్పుకున్నకొద్దీ

అధ్భుతమైన గీతాలల్లుకునేస్ఫూర్తి నీ కందుతూనే ఉంటుంది

మాతృమూర్తులకు ఇవ్వదగిన నోబెలుబహుమతులేవైనా ఉంటే

కామాన్నీ సంతానేఛ్చనీ రెండు కోరలుగా

మా ప్రాధమిక హక్కుల్ని పరిహసించే మీ తండ్రులకివ్వండి

ఇటు పిలిస్తే అటు పరిగెడుతూ

మా కొంగుతో ముక్కుతుడుచుకున్నంత చప్పున

పద్యాల్ని చేతిరుమాళ్ళుగా వాడకండి.

-కొండేపూడి నిర్మల

మనసా..నై జాగృత!

మనసా..నై జాగృత!

కర్లపాలెం హనుమంత రావు

ఎర్రటి మిట్టమధ్యాహ్నప్పూట..మరీ అంత ఎర్రటిది కాదులే.. కేటాయించిన గదిలో..పంకాలేమీ వుండవు ఇక్కడ..పడుకుని..ప్రాస లేకుండా బతకాలంటే పద్యానికి ఎంత కష్టమో వచనానికేం తెలుసు!

నిన్నకాక మొన్న పుట్టింది. పుడుతూనే నిప్పును మూటకట్టుకొచ్చింది. చెప్పుల్లేకుండానైనా నిప్పులమీద నడవగలదు. చెప్పుల్తోనైనా గుళ్ళోకి జొరబడ గలదు. తప్పనిపించదు. నడకే గొప్పా పాదానికి.

ఆచయామి సమయంలోనైనా జంధ్యప్పోగుని తీసే అనుగ్రహం లేని విబూది విగ్రహానికి పొడి పైబట్టతో బైటికి కదిలి రావడమే మహాగొప్ప విప్లవ కార్యక్రమము మిత్రమా! పరమ పూజ్యమైన జాంబవంతుని చరిత్ర పరమ పురాతనమైనదే కానీ..శిధిలావశేషాలనుంచీ తవ్వి తీసిందీ పొద్దునేగా!అప్పుడే గాలి మారుతుందా?

పెరుగుబండి ఆలస్యంగా వస్తే నిన్నట్లాగే టౌను హోటళ్ళ మధ్యాహ్నం విస్తారాకులకి ఈ పుటా  మజ్జిగనీళ్ళ పస్తే. తాత భుజాల  మీదెక్కి తప్ప తిరగటం రాని మనవడు..తాత మీసాల మీద పాట కట్టటమొక్కటే మారింది! సంబరమా?

బాగుంది. ఏ చెట్టుని మనం మట్టికి వదిలి పెట్టాం కనకలే…ఒక్క డబ్బు చెట్టుకు మాత్రం ఎరువులు దండి.

అదిగో  మళ్ళీ దండకోసం ముత్యాలేరుతున్నావు..నువ్వు మారవు.

నిజమే!  ముఖానికింత బొట్టైనా లేకుండా నలుగురి కంటాబడని  అమ్మచేతి ముద్ద వాసన అంతిదిగా రద్దై పోతుందా?  సంధులు కుదరని జంటపదాలుగా తిరగాలంటే  బహుకష్టమే సుమా! దుష్టసమాసాలకు అలవాటు పడ్డాక,  అచ్చుతప్పుల్నివాసన పట్టే  నాసిక చెడ్డాక..కుసుమశోభితమైన రసపానీయానికని ప్రయాస పడితే చాదస్తుడనైనా పేరొస్తుంది..చెడిపేస్తున్నాడని చెప్పైనా పడుతుంది.

తస్మాత్ జాగ్రత్త్త మనసా..నై జాగృత!

షాజహాను స్వప్నంలో ‘ముంతాజ్’ -దుర్గానంద్

షాజహాను స్వప్నంలో ‘ముంతాజ్’

-దుర్గానంద్

ఏమీటీ తాజ మహల్

ఇలా కట్టావు పాదుషా?

నీకు తెలీకపోతే మానె

లోకాన్నైనా అడిగావు కావు

ఏం చెస్తాను నా నసీబు;—–

…………………………………

ఒట్టి పిచ్చిదాన్ని,

నీ కోర్కెకు నవ్వి వూరుకుంటే సరి పోయేది

అసలు నేనిలా కోరక

నీ షేర్వాణీలో తలకాయ దూర్చి

‘అన్నమో పాదుషా’ అని

పెద్ద పెట్టున కేకవేసి కన్ను మూస్తే

అప్పుడు…

నువ్వేమైనా కట్టేవాడివేమో

పాలరాళ్ళు ఒలకబోసి

సముద్రం మీద ప్రాజెక్టు-

ఓ పిచ్చి మొగలాయి రాజా!

ఈ పాలరాళ్ళ మైకంలో

పడుకున్న నన్ను

కయామత్తురోజున ఖుదా కూడా లేప లేదు”-

క్రాంతి శ్రీనివాసరావు ||లోపలి వ్యవసాయము ||

క్రాంతి శ్రీనివాసరావు ||లోపలి వ్యవసాయము ||

ఒక దృశ్యం ఎప్పుడో
తెలియ కుండానే మనసులో
విత్తనమై నిలుస్తుంది
… ఎప్పుడో అప్పుడు అదే
మళ్ళీ దృశ్యమై మొలుస్తుంది

ఒక వాక్యం ఎప్పుడో మనలో
నాటు కొంటుంది
అదే మళ్ళీ ఎప్పుడోఅప్పుడు
కొత్త భావాలను కాస్తుంది

ఒక అనుభూతి ఎప్పుడో
మనసు చాళ్ళలో చల్ల బడుతుంది
అదే ఎప్పుడో అప్పుడు
మనసు పొరలను చీల్చి
మరలా మొక్కై నిలుస్తుంది

ఒక పరీమళం ఎప్పుడో
మనసు పాదులో పాతుకొంటుంది
అదే కుదురు కట్టుకొని
మళ్ళీ మహా వేగంతో పెరుగుతుంది

ఒక శబ్ధం ఎప్పుడో
మనసు మడిలో మిగిలిపోతుంది
అదే తిరిగి అంటుకట్టుకొని
ఆకాశం ఎత్తుకు ఎదుగుతుంది

మనుషులందరూ మడిలాంటి వాళ్ళే
తనువున్న పరిసరమే విత్తనమై
జీవిత మొక్కగా ఎదుగుతుంది

అందుకే
లోపలి వ్యవసాయానికి
మనసు మడి తడిపేందుకు
కాసిన్ని కన్నీళ్ళు కావాలి
కలుపు మొక్కలను ఏరేందుకు
కాస్తంత కవిత్వమూ కావాలి

యాకూబ్ కవిత-నా పరామర్శ

యాకూబ్ కవిత- నా పరామర్శ

Tuesday, March 19, 2013

6:27 PM

యాకూబ్ | ఇలా…!

……………………

సహజంగానే ఉందాం

చల్లని గాలిలా ఉందాం, ప్రేమలా ఉందాం

నిప్పుకణికలా ఉందాం

నిలువెత్తు నిజంలా ఉందాం

సహజంగా ఉందాం

అలజడిలా ఉందాం,ఎలుగెత్తే పాటలా ఉందాం

పడవలకు ఈతల్నీ, అలలకు కదలికల్ని నేర్పుదాం

అక్షరాలకు కవచాలు తొడిగి సైనికుల్ని చేద్దాం

మట్టిని మన మాతృకగా లిఖిద్దాం

కాలానికి భాషనేర్పి భవిష్యత్తును ఇద్దాం

ప్రశ్నల్లా ఉందాం,పలకరించే స్నేహితుల్లా ఉందాం

సహజంగానే ఉందాం

నకిలీ ముఖాలమీద ఉమ్మేద్దాం

నిజంలా ఉందాం, కలల్లా ఉందాం, నిర్భయంగా ఉందాం

కవిత్వంలా ఉందాం

సహజ సహజ సహజంగా ఉందాం !!!

*సరిహద్దు రేఖ ‘సంకలనం నుండి…మార్చి,2000

నా పరామర్శః

పువ్వు తాజాగా ఎందుకుంటుంది?

పిట్ట రెక్కలకా స్వేచ్చ ఎక్కడిది?

హెచ్చార్కె ఎక్కడో ఓ కవితలో అన్నట్లు గుర్తు..ఎగ్జాట్ పదాలిప్పుడు గుర్తు లేవు కాని..పాపాయి ఎవరి కోసమూ ఏడవదు..ఎవరి కోసమూ నవ్వదని.

సహజత్వమంటే అదేనేమో. ఆ తత్వం మీదే  ఈ కవిత్వమంతా!

పంచదార పలుకులు పది కంట పడగానే పరుగెత్తుకొచ్చేస్తుంది చీమ.  ఎలుగెత్తి చాటుతుంది తోటి చీమలకా తీపి వార్త  చేరేదాకా! చీమల కన్నా ఘనమైన కమ్యూనికేటర్లమా మనం?

కొమ్మల్లో కోయిలమ్మ ‘కో’ అన్నా..తుమ్మల్లో గుడ్లగూబ ‘గీ’ అన్నా

ఒక పరమార్థమేదో తప్పకుండా అంతర్గతంగా ఉండే ఉండుంటుంది. అనంత జీవకోటి అహోరాత్ర హృదయ ఘోషేమో అది! అనువదించు కోవడం మనకు కుదరనంత మాత్రాన అది జీవభాషవకుండా పోతుందా?  తాలు పదాల ఎత్తిపోతే కవిత్వమనుకునే మనం జంతుజాలం గొంతుల్లోని స్వేచ్హాస్వచ్చతలను కత్తికోతలుగా చిత్రిస్తాం. చిత్రం!

బక్క జీవాలనేముందిలే.. ప్రకృతి మాటను మాత్రం మనం పట్టించు కుంటున్నామా? పూల రుతువు విరిసినపుడు, సిరివెన్నెల కురిసినపుడు, చివురుటాకు పెదవి మీద మంచు బిందువు మెరిసినపుడు, పెను చీకటి ముసిరి వినువీధిన కారు మొయిలు ప్రళయార్భటి చేసినపుడు, జడి వానలు కురిసి కురిసి  ఏళ్ళువూళ్ళు నొకటి చేసి  ముంచేసి నపుడు..అయే  చప్పుడు మన చెవుల కెక్కిందెప్పుడు?

అనుదినముం బ్రదోషసమయంబున బ్రొద్దున వేయిచేతులం

బనిగొని వర్ణవర్తికలు వ్యర్థముగా క్షణభిన్న రూప క

ల్పనల నలౌకికాకృతుల బంకజమిత్ర, యయాచితంబుగం

బొనరిచి నీ యపూర్వకళాపోడిమి జుల్కనసేయ బాడియే?

-అంటో  కవికోకిల దువ్వూరివారెంతలా కలవర పడేం లాభం?

ప్రకృతి సంగతలా పోనీ.. పక్క మనిషి  గుక్కనైనా ఒక్క క్షణమాలకిస్తున్నామా? ఆక్రోశం రగిలి, ఆవేశం పొగిలి, ఆనందం పెగిలి అవమానం తుంచినపుడు, అనుమానం ముంచినపుడు,అభిమానం పెంచినపుడు.. కోపం కట్టలు తెంచుకుని , తాపంగుట్టలు పేల్చుకుని, పరితాపం పుట్టలు చీల్చుకుని ..చెలరేగే భావాలు, కదలాడే క్రోధాలు, కలిపెట్టే భయాలు..  కన్నీళ్ళు, ఎక్కిళ్ళు, కౌగిళ్ళు .. ఆర్ద్రంగా, చోద్యంగా, హృద్యంగా ..తీవ్రంగా, హేయంగా, తీయంగా..కులం గోత్రం..మతం ప్రాంతం..చిన్నాపెద్దా..బీదా బిక్కీ..రోగీ భోగీ.. నలుపూ తెలుపూ.. ఆడామగా..తేడా లేకుండా..అందరికీ సమంగానే వస్తాయా..రావా! కలలు, కలవరాలు  సమానమేగా చీమూ నెత్తురు నాళాల్లో పారే  ప్రాణులెవరికైనా? ఐనా తమదాకా వస్తేగానీ కదలని రథాలం మనం.

‘పోయెను పాపభీతి, విడిపోయెను ముష్కుర నీతి, మాయమై

పోయెను శాంతి, వ్య్ర్థర్థమైపోయెను దేవుడు పడ్డపాట్లు, వా

పోయెను భూతధాత్రి, సరిపోయెను పొట్టకు జీవితార్థ,  మై

పోయెను మానవామర మహోదయస్వప్న మహస్సమాధిగానె!’

అని ఈ దేవదానవులమిశ్రమాల కోసం ఎన్నో మార్లు మారి మారి అవతరించిన దేవుడే ఆఖరికి  అలసిపోయి ఇహ మార్చడం తన తరం కాదని మార్చ లేనిదంతా   హతమార్చడం తప్ప వేరే దారేదీ లేనే లేదని  ఒక్క క్షణం నిస్పృహలోపడి నిరాశగా చేసుకున్న సృష్టినంతా   చెరిపేసుకుని ఠక్కుమని లేచి పోతే? పోలేదుగదా!

‘మాదిరి దప్పి మానవు లమానుషవృత్తి జరింప, జెల్లినన్,

కాదగు పూరుషార్థ మది కాదగునే పరమార్థ మింక నీ

మేదిని లేదె, సిల్వపయి మేకు కరంగిన గుండె నెత్తురుల్

బూదయి పోయెనే, ఋషులు బుద్ధులు నూరక పుట్టిపోయిరే!’

అని చీకాకుల పాలవకుండా పాపం   సహనంతో స్నేహంగా సర్దుకు పోయిన ఆ పెద్దాయనలాగే..కవిత్వం పొంగుకొచ్చి సమయానికి రాసే ఏసాధనమూ చేతలేక తాళపత్రం కోసం ‘తాళమా! తుత్తినియలై  ధరపై  బడుమా!’ అంటో కోపించిన నిప్పుకణికలతో నీరులా సహృదయ సంబంధాన్నే  కోరుకుంటున్న ప్రేమకవిత్వం కూడా ఇది. ప్రేమంటూ వుంటే చంద్రుడిలో మచ్చను కూడా మందులా నాకేయచ్చంటాడు కదా శ్రీరంగం నారాయణ బాబు! గుబులును కెలికే అగాథన్నుంచే  సుధను చిలికి పంచాలనుకోవడం మించిన గొప్పతత్త్వ మింకేముంటుందబ్బా ఏ కవిత్వానికైనా?

ఘటమంటూ లేకుండానే గట్లు దాటే  ఆత్మలున్న వైతరణి కదా ప్రస్తుతం మనం పడి ఈదుతున్నది.  పంచభూతాలకీ పంచేద్రియాలకీ  కట్టుబానిసలమై పోయి బతకీడ్చటం దుర్బరమై పోతున్నదని వాపోతున్నది. ఐనా  ‘దోమలు నల్లుల కన్నాకరువులు వరదలేం ఎక్కువరా కన్నా!’ అనేదో సరిపెట్టుకొనే కదా  మనమీ కంటకాల బతుకునిలా ఏడుస్తూనన్నా ఈడుస్తున్నది! ‘బోను తెరిస్తే నోరు తెరిచే పెద్దపులిరా బాబోయ్-జీవితం’ అని తెలిసీ చొక్కా దులిపేసుకుని ఎంచక్కా ముందుకే దూకేస్తున్నామా లేదా? ‘అదృశ్య హలాలతో అవ్యక్తాలను దున్నిఅనుమానాలను  చల్లి అలజడి సాగునే ఐనా ఎలాగో  కొనసాగిస్తూనే ఉన్నామా కాదా? ఈ కవిత్వానిదా టైపు  ఆందోళన కానే కాదు. చరిత్ర కెక్కాల్సిన బాధల్ని అశ్రుబిందువుల హిందోళంగా మలిచే కళ.  మరి అవసరమేగా!

లోకమంతా మరీ ఇంతలా  బురద గుంతలానే ఉందా?. బ్రహ్మజెముళ్లే గాని  బోధి వృక్షాలసలే  మొలవని పుంతై పోయిందా?  సుష్టుగా మెక్కి మేడమీదెక్కి మెత్త పరుపులు తొక్కే నిద్ర పట్టని పెద్దయ్యల నెత్తి మొత్తుకోళ్ళకేం గానీ.. ఆవల జొన్నచేను కావలికని  మంచె మీద చేరిన నాయుడుబావయ్య  కన్నుమూత పడకుండా తీసే కూనిరాగాల నాలకించవయ్యా!  ‘ఆ కులాసా ఊసులనే ఎంకిపిల్ల ఊహలకో దిలాసాగా చేరేసే చల్లగాలి పదాలవుదాం.. పదవమ్మా!’అంటున్నదీ కవిత్వం. సర్దాగానే కాదు సరసంగాను  లేదూ ఈ తరహా వరస?

బ్రతుకేమన్నా మృత్యుగ్రంథ ముపోద్ఘాతమా? సంక్లిష్టం కావచ్చేమో కానీ.. సజీవ స్వప్నసౌజన్యం కూడా సుమా! హృదయానువాద కళన ఆరితేరుండాలే కాని మూలమూగ సైగల్నిసైతం ‘సైగల్ రాగాలు’గా మలచడం క్షణం. ‘సహజ సహజ సహజంగా ఉందాం !!!’ అని కవి అన్నేసి మార్లలా కలతనిద్ర మధ్యలో మాదిరి పలవరించడ మాత్రం మహా అసహజంగా ఉందని కదూ సందేహం?    తత్వం తలకెక్కకే  ఈ చిక్కుముడి. మనసు ఎక్కి జారే  జారుడుబండంట చైతన్యం. రాయీ రప్పా, పశువూ పక్షీ,  మనిషి- అదే క్రమంలోశుద్ధభౌతికం, ప్రాణం, మనసు లాక్రమించిన జీవస్థానాలని  ‘తత్త్వప్రభ’ ప్రబోధం.’పరస్మాత్ ప్రస్థితా సేయం/భూమి కానాం పరంపరా/సోపానకల్పితాకారా/నిః శ్రేణి రివ నిర్మితా’ అంటే అర్థం ఇదేనండీ బాబూ! భూ భువ సువ ర్లోకాల పైనున్నమహర్లోకంలోని  చివరి ఆనందం  మన మనీ ప్రపంచంలో  గుప్త రూపంతో అప్రకాశంగా అణిగి పోయింది కదా..  ఈ చిదానందాన్నా కూపంనుంచి చివరి కెలాగైనా చేదుకోవడమే ఏ కళకైనా పరమావధని లక్షణగ్రంధాల సిద్ధాంతం కూడా.  తృణకంకణం కృతి సమర్పణంలో ‘శాశ్వత నవ్య స్ఫురణల/ నశ్వరలావణ్యమై పెనగ, కావ్యకళా/విశ్వమునం దానంద ర/సైశ్వర్యము లేలు’ నని  రాయప్రోలువారానాడు కనిపెట్టిన రస రహస్యాన్నే యగైన్’ యే చోళీ కే పీచే యేహీ హై’ అని మళ్లీ ఈ కవిత గుర్తు చేస్తున్న్దన్న మాట. గొప్పే కదా మరి?

తొలి ఉషస్సు తూర్పును తడిపే వేళకి గుండె చేతపట్టుకుని గుమ్మంలో నిలబడుండేదే కవిత్వం. లోగిలి ఎవ్వరిదని కాదు  తల్లిలా లాలించడమే   కవితా ధర్మం. ఆశించిన హస్తం ఏ భూతానిదైనా కాని ప్రేమతో ముందుకు నడిపించడమే పదంలోని తండ్రి పని.’ఒరులేయని యొనరించిన/నరవర! యప్రియము తనమనంబునకు తా/నొరులకు నని చేయకునికి, / పరాయణము పరమ ధర్మ పథములకెల్లన్’ అని కదా  నీతి! ఆ నీతిని తన ధర్మంగా ప్రకటించుకున్న కవతని అభినందించి తీరాలి. ఆకాశం అనంతం అగాథం అనంతం కారుణ్యం అనంతమైతే కావచ్చు కానీ కవి అంతరంగం ముందు అవన్నీమోకాలు తడవని పిల్లకాలువలు. నిరంకుశుడైతేనేమి ఒక ధర్మాస్త్రానికి సత్యంగా కట్టుబడుండాల్సిన ఆంజనేయుడు కవి. అపారసార సంసారసాగర మధనం చేసి నవజీవన సుమధుర సుధారస సువర్ణ కలశం తీసి నిరాశ నిట్టూర్పులతో నిండి యెండి మండే కంఠాల రక్తి భక్తి ముక్తి శక్తిధారలుగ ఒలికించాలనే  సంకల్పం  స్వల్పమైనదా? నిప్పుకణికలా, నిలువెత్తు నిజంలా,  అలల్లా, అలజడిలా,కలల్లా, కలవరంలా, అక్షరాలకు తొడిగే సైనిక రక్షాకవచాల్లా, మట్టిలా, కాలానికి భాషనేర్పే భావిలా, ప్రశ్నల్లా,  పలకరించే స్నేహితుళ్ళా సహజంగా సహజంగా సహజంగా ఉంటానంటం కన్నామించిన మంచి దర్శనం ఏ కవికైనా  ఇంకేముంటుంది?  సహజంగా ఉంటానని అన్నేసి మార్లు సంకల్పం  చెప్పుకున్నా  కవిత్వంలా మాత్రం వుండడం మానబోనని ప్రకటించడమే  ఈ కవి అసలు పాటవం. ఎక్కడ ప్రేమ అవ్యాజమో, ఎక్కడ సత్యమకుంఠితమో, ఎక్కడ నీతి నిశ్చలమో  అక్కడ కవి పువ్వై వికసించడంలో వింతేముంది కానీ ఎడారిలో సైతం ఒయసిస్సై పిలవడం, నడిసంద్రాన కూడా గడ్డిపోచై నిలవడం అపురూపం. ‘చిగురింపగలవాడు శిశిరకాలమునైన ప్రకృతినెల్ల వసంతరాగ కాంతి/కాయింపగలవాడు కాళరాత్రినైన రమణీయ చంద్రికా సముదయముల/కురియిపగలవాడు మరుభూమిలోనైన సతతము అమృత నిష్యంద వృష్టి/మలయింపగలవాడు మండువేసవినైన మలయపర్వతశీత మారుతములు/అరయగలవాడు బాహ్యము నంతరంగమును/వ్రాయగలవాడు దైవ లీలావిలాస/చిత్రములనైన, బ్రహ్మాండసీమనైన/కవికసాధ్యంబు రవ్వంత గలదె భువిని! -అన్న తత్వం ప్రతి అక్షరంలో ప్రత్యక్షమౌతున్నందునే ఈ కవిత్వానికిలా ఉత్తమత్వం.

హంసలన్నీ శ్వేత వర్ణంలో ఉండవు కొన్ని నల్లగానూ ఉంటాయంటారు.. ‘ నల్లగా ఉన్నావేమని’ నాలాంటి నిత్య శంకితుడొకడు నిలదీస్తే ‘నీలకంఠుడు నిద్రపోతే గళమే నల్లకలు వనుకొని కొరికా. విశ్వమానవ సహస్రారం మళ్ళా అర్పిస్తేనే తెల్లబడేద’ని జవాబు.

అర్థం అయితే తత్-త్వం-అసి(నీవే అది). కాని వారికీ కవిత్వంలాగానే తత్వం- మసి.

స్వస్తి.

పుష్ప వివాదము-యామిజాల పద్మనాభ స్వామి

పుష్ప వివాదము

(కవులూ పువ్వులూ సమాన ధర్మము కలవారు. పరిసరాలను తమ తత్త్వముతో సుగంధభరితము చేయటమే కర్త్వవ్యము.  యథాశక్తి  ప్రాకృతిక దీక్షతో సామాజిక సేవాబద్ధులై పదుగురితో  ‘శభాష్’ అనిపించు కొనవలె కాని..తమలోతాము ఔన్నత్యముని గూర్చి వృథావాదనలకు దిగి  పలుచనగుట తగునా!

కవులతోనే లోకములు తెలవారుట లేదు.ప్రొద్దు గుంకుట లేదు. ప్రాపంచిక సుఖదుఃఖముల పానీయ పాత్రలో కవుల పాత్ర కేవలము రుచి పెంచు పంచదార తేనియల వంటిదే.

ఒకరు పంచదార..ఒకరు తేనెబొట్టు. రెండింటి మిశ్రమమే మధుర పానీయము కదా!-

ఈ ఊహలలో ఉన్న నాకు   యామిజాల పద్మనాభ స్వామి గారి – ‘పుష్ప్ప విలాసము’- 1953 ఉగాది భారతి సంచికలో ప్రచురితమైన కవిత కంట బడినది. నాడూ ఈనాడు వలె కవి వర్గముల  మధ్య ఒక స్పర్థ వాతావరణేమేదో ఉండి ఉండవలె. కోకిల స్వరములోని మందలింపుల నాలకింపుమని ప్రార్థన.)

పుష్ప వివాదము

అదొక పూలతోట.పలురకాల పూల జాతులు నవయవ్వనముతో మిసమిస లాడుతున్నై.ఒక్కొక్క తీగనె పరిశీలిస్తూ పోయి నెను ఒక తిన్నెపై కూర్చున్నాను.అంతలో మలయమారుత కుమారుని చక్కిలిగింతలతొ చెలరేగింది పుప్పొడి దుమారం.చివాలున లేచింది మల్లె. వాదు మొదలైనది.

మల్లె

ఏమే! గులాబీ! నిన్న కాక మొన్న వచ్చి నువ్వు తోటివారినందర్నీ ఆక్షేపిస్తున్నావట? ఎందుకా మిడిసిపాటు?

తావుల్ జల్లుదువా సుదూరముగ? పంతాలాట సైరింతువా?

ఠీవిన్ నిల్తువ రెప్పపాటయిన? చూడ్కిన్ సైతువా గట్టిగా?

క్రేవన్ బాలసమీరుండు నిలువన్ ప్రేమించి లాలింతువా?

పోవే; నెత్తురు కోతలే కదనె నీ పుట్టింటి సౌభాగ్యముల్.

గులాబి

సరే వారన్న మాటలు వినవు చూడు!

వలపులు గ్రుమ్మరించి సుమభామల చిక్కని కౌగలింతలం-

దలరెడు తేటిరాజునకు హాయిగ స్వాగతగీతి పాడునా?

వ్హెలువము కర్కశంబు కద; చెల్మి యెరుంగను పాపజాతితో;

తల విలువన్ గణింపవలదా? మరి సంపంగి కన్నె; మల్లికా!

కేతన

అదలా వుండనీ కానీ అక్కామల్లికా!

ఈ మందార మల్లిక నన్నేమని నిందించిందో విన్నావా?

నీకే చెల్లెనె కేతకీ; కనులలో నిండార దుమ్మోయగా;

తాకిన్ నెత్తురు చింద వ్రేళ్ళు కొరుకన్; సర్పంబుగా నిల్వగా;

ఆ కంఠంబుగ పాపజాతికి శరణ్యంబై మహారణ్య మం

దేశాంతంబుగ రాణివై మెలగ; ఏరీ సాటి నీకిలన్.

చేమంతి

ఓహో! దాని అందానికి అది మురిసిపోవాలిః

పరువంబా! ఎదలోన మెత్తదనమా?భావోల్బణ ప్రక్రియన్

గరువంబా!మకరంద గంధ విలసత్ కళ్యాణ సౌందర్యమా?

బిరుసై నిప్పులముద్దమోము కద;యీ పేలాపనంబేల? సం

బరమా? వచ్చిన దాని నోర్చుకొనునా పైపెచ్చు మందారమా?

మందారము

ఔనౌను నీ శౌభాగ్యనికి నన్నాక్షేపిచ వద్దూ?

పంతములాడబోకె పయివారలు విన్నను నవ్వుకొందురె;

ఇంతులు దండలల్లకొని యెంతయు ముచ్చటతో ధరింతురం

చెంతువు నీ విలాసము ‘లిహీ’ యగు మాలతికన్నె ముందు చే

మంతిరొ! ఊక రేకుల సుమంబను పేరది  నీది కాదటే;

(అంతలో చేరువలో నున్న సరోజిని ఫక్కున నవ్వి)

సరోజిని

దానికెమిలే! మాలతిలో గర్వమున్నది.

అది రేరాణినటంచు త్రుళ్ళి పడునమ్మా! దాని లేనవ్వులో

పదముల్ పాడునటమ్మ! తుమ్మెదలు; శుబ్రజ్యోత్స్నపైపూతతో

పెదవుల్ నొక్కునటమ్మ! చందురుడు, నన్వీక్షించి బల్ టెక్కుతో

ఎదో అలాపము సేయు మాలతిని నేనిన్నాళ్ళు సైరింతునే?

మాలతి

సైరింపక యేమి సేయగలవే? నీ వాడిన మాటలో?

బంగరు కొండపై పసిమి వెన్నెల చిన్నెల బాలభామ రే

ఖంగనవో యటంచును  ఎగాదిగ చూచెద నన్ను; నీవు రే

లం గమనీయ హాస సువిలాస వికాసములొప్పువాని చం

ద్రుంగని మూతి మూసుకొని క్రుంగవొ? నీ బ్రతు కే రెఱుంగరో?

                     *                    *                *

చతురత మీర నిట్టి సరసా లిక చాలును కట్టిపెట్టు నీ

బ్రతుకు భవిశ్యమున్ కడిగివైచెద; నాచున బుట్టి, పీతలన్

కుతకన్ దాల్చి, నీదు కనుగొల్కుల చిమ్ముదు; నీటి పుర్వువై

అతుకులబొంతవై; కసబువాతెర విప్పకుమా సరోజినీ!

ఇల్లా ఒకరినొకరు ఆక్షేపిచుకుంటూ ఉండగా శ్రుతి మించిందని మావి కొమ్మపై

కోకిల

భళిరా! పువ్వ్వుల కన్నెలార మన సంబంధంబుతో లోకముల్

తెలవారున్, క్షయి సేయు, నవ్వుకొను, ప్రీతింజెందు; మీలోన మీ

రలయింపన్ తగవా? యటంచు పగలన్ న్యాయంబుగా తీర్చు రే

ఖిల పో పొండన గూసె ‘కో’ యని కుగూకారమ్బు తోరంబుగన్.