మహారాజ రాజ రాజపరమేశ్వర రాజమార్తాండ వగైరా
మహారాజులుంగారిని
ఖుషీ చెయ్యటంకోసం
మంచినీళ్ళు మధువుగా మారుస్తాడు
వదరుకప్పల్ని వందిమాగదులుగా
బొద్దింకల్ని పోలీసువాళ్ళుగా
మారుస్తాడు.
పందికొక్కుని పాలగూడెం బాబా చేస్తాడు.
వంగి సలాంచేసి
వేళ్ళ చివళ్ళ మల్లెపూలు పూయిస్త్తాడు.
ఛూమంతర్!
మాట్లాడే మైనా వాడి భుజంమీద కూర్చుంటుంది అక్కడ.
‘ఇంకో కొత్త మాయ ఆలోచించు,
నల్లటి నక్షత్రం
పొడిపొడి నీళ్ళూ…!’-అని ఆజ్ఞాపిస్తారు
మహారా…………………………జులుంగారు.
నల్లటి నక్షత్రం
పొడిపొడి నీళ్ళూ చేస్తాడు.
ఓ విద్యార్థి వచ్చి
‘ఒకటికన్న యెక్కువైన sine తీటా ఉహించు!’
అని అడిగితే
వెలవెలబోయిన
మాంత్రికుదు జితో
మైనెస్ ఒకటినుంచి ప్లస్ ఒకటిదాకా మాత్రమే
అరిచి గింజుకున్నా
ఏంచెయ్యలే దాన్ని’
అంటూ నీళ్ళు నములుతాడు.
మహారాజదర్బారునుంచి
వందిమగదుల మూకనుంచీ
నిశ్శబ్దంగా నిష్క్రమిస్తాడు
మాంత్రికుడు జితో
తన గూటికి.
(మీరాస్లాన్ హోలూచ్ అనే చెకోస్లావేకియన్ ‘వైద్యుదు-కవి’ రాసిన Zito the magician అన్న వచన పద్యానికి వి ఆర్ వేలూరి స్వేచ్చానువాదం)
మీరు బ్లాగ్ వేదికలో మీ బ్లాగును అనుసంధానం చేసినందుకు కృతజ్ఞతలు అందిస్తున్నాము.బ్లాగర్లకు మా విన్నపం ఏమనంటే ఈ బ్లాగ్ వేదికను ప్రచారం చేయటంలోనే మీ బ్లాగుల ప్రచారం కూడా ఇమిడి ఉంది.ఈ బ్లాగ్ వేదికను విస్తృతమైన ప్రచారం కొరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము.దానిలో భాగంగా ఈ బ్లాగ్ వేదిక LOGO ను మీ బ్లాగుల ద్వారా బ్లాగ్ వీక్షకులకు తెలియచేయుటకు సహకరించవలసినదిగా బ్లాగర్లకు విజ్ఞప్తి చేస్తున్నాము.బ్లాగ్ వేదిక LOGO లేని బ్లాగులకు బ్లాగ్ వేదికలో చోటు లేదు.గమనించగలరు.దయచేసి మీకు నచ్చిన LOGO ను అతికించుకోగలరు.
క్రింది లింక్ ను చూడండి. http://blogsvedika.blogspot.in/p/blog-page.html