పాలరాతి విగ్రహాన్ని మనం చూస్తే ‘ఆహా..ఎంత బాగుంది’ అని ఒకసారికి మెచ్చుకుని వదిలేస్తాం. అదే ఇంద్రకంటి హనుమచ్చాస్త్రిగారి వంటి భావుకుని కంటపడితేనో?!
” ఈ తళుకెట్లు వచ్చినది!
ఏ పువురేకుల పాలు పిండి యీ
రాతిని చేసె ధాత; పర
రాజులు తాకుట కోర్వలేని యే
నాతి శరీర రేణువులు
నవ్వుచు జేరెను పాలరాతిపై
ఏ తరుణానిలమ్ములిట
ఇంతటి ఊపిరి పోసి పోయెనో!”..అని తన్మయులై పోతారు.
“మదనుడు వైచినట్టి బాణము త్రోవ తప్పి,
రెద లుడికింప బోవుటల
నేమరి, సూటిగ తాకెనేమొ, యీ
కదలని పేదరాతికి, వి
కాసము నిచ్చినమాట వింటివే!
పదనగు మల్లె పాటవము
పాలను రాతిని పొంగజేసెనో!”
అని మన మనసులకూ గిలిగింతలు పెట్టేస్తారు.
అదీ కవికీ..మనకీ మధ్య తేడా!
ప్రకృతితల్లి అందాన్ని తనివితీరా పొగిడే ధన్యజీవి – కవి.
మీ బ్లాగుని పూదండ తో అనుసంధానించండి.
http://www.poodanda.blogspot.com
నిజమే….ఎంతందంగా చెప్పారో!