అశ్రునివాసి
అతని మాటలు వినడానికి నేను దేశదేశాలు తిరిగాను.
కాని అయ్యో! అంతా వృథానే అయిపోయింది.
నేను తిరిగి వచ్చినప్పుడు విన్నాను అతన్ని వింతగా
నా స్వంత పాటలోనే!
ఎవరివయ్యా నువ్వు? అతన్ని వెదకడానికి బిచ్చగాడిలాగా గడపగడపా తిరుగుతున్నావు?
నా హృదయ సీమలోకి రారాదా.. అతని ముఖాన్ని చూపిస్తాను
నా కన్నీటిలోనే!
బావుల్ పాటకు విశ్వకవి రవీంద్రుని అనువాదానికి తెలుగు సేత
వివరణః వంగసీమలో ఒక విధమైన యోగసాధకులను ‘బావుల్’ అంటారు
Nice one. http://www.screentalent.wordpress.com