హెచ్చరికః ఇది వేదాంతం. వంటికి సరిపడని వాళ్ళు దూరంగా ఉండటం మంచిది సుమా!
గంధపు కట్టెలు
(కవిత్వమంటే అదీ..కవి అంటే అతడూ!)
కంటికిగడవెడుగా నేడ్చు కులకాంత గడప దాటియు గూడ గదియరాదు
కడుపు చుమ్మలుచుట్టగా వందిరెడి తల్లి కాటివఱకుగూడ గదియరాదు
గడియించుసర్వమ్ము గైకొన్న సుతుడెల్ల కాలుదాకంగూడ గాంచబోడు
కడుమేళ్ళు తనవల్ల గన్నవారు తిలోదకమొసంగుటకేని కానబడరు
ఔనె! బ్రతికినన్నాళ్ళు నిసానబట్టి-నట్టి గృహమేథి తొఱగి కాయంబు చితిని
గాలుచుండ దోడుఱికి యంగంబు వాయు-చుందు నీవంటివారేరి చందనంబ?
-మిన్నికంటి గురునాథ శర్మగారి- అడవి పువ్వులు-నుండి!
ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన తల్లికాని,, ఇల్లాలు కాని, సంపాదనంతా అందుకున్న పిల్లలు కానీ, బతికున్న కాలంలో ఎన్నో మేళ్ళు పొందిన బంధుబలగం కానీ ఎవ్వరూ ప్రాణం పోయిన తరువాత తోడురారు. బతుకున్న కాలంలో రాచి రంపాన బెట్టినా..అవేమీ మనసులో పెట్టుకోకుండా కట్టె చితిలో కాలుతున్నప్పుడు కూడా తోడుగా సహదహనమయే గంధపుకట్టెలను గూర్చి కవి ఎంత ఉదాత్తంగా కల్పన చేశాడో కదా! కవిత్వమంటే అదీ..కవి అంటే అతడూ!
గాలుచుండ దోడుఱికి యంగంబు వాయు-చుందు నీవంటివారేరి చందనంబ?
-మిన్నికంటి గురునాథ శర్మగారి- అడవి పువ్వులు-నుండి!
మీరు బ్లాగ్ వరల్డ్ లో జాయినవ్వండి. విసృతమైన ప్రచారం మీ బ్లాగుకు కల్పించుకోండి.
http://ac-blogworld.blogspot.in/
ఆర్యా, నమస్కారములు.
చాలా గొప్ప కవిత ఇది. ఆ గంధపు కట్టెలు కాలటమే కాకుండా, తమ పరిమళాన్ని వెదజల్లుతూ, స్నేహ పరిమళమంటే ఇదే అని తెలియచెబుతున్నట్లుగా వుంటుంది.
మీ స్నేహశీలి,
మాధవరావు.
ప్రాచీన సాహిత్యాగాథంలో ఇలాంటి ఆణిముత్యాలు చాలానే దాగున్నాయి.. విజ్ఞులు ..మీకు తెలియనిదేముంది మాధవరావు గారూ! ఈదిన కొద్దీ సంపద!