అమృతం అమరలోకలోనే ఎందుకు దిగబడి పోయిందో తెలుసాండీ..చీమలకు జడిసిట. వసురాయడు ఒక చాటువులో చమత్కారంగా చెబుతాడూః
చీమలకడలి, పయోనిధి
లో మొదలం దాగి, దైత్యులున్ సుర లెత్తన్
భూమి గనకభయ మమృతం
బామరలోకమున కరిగె హాయిగ బ్రదుకన్!
మొదట్లో సముద్రంఅడుగునే దాగి ఉండిట. దేవతలు, రాక్షసులు పైకి లాగే ప్రయత్నం చేస్తుంటే భూమ్మీది చీమలకు జడిసి నేరుగా అమరలోకంలో స్థిరపడిపోయిందని పద్యం చమత్కారం
వావ్…భలేచెప్పారు.