శివం-సుందరం-సత్యం -పాలగుమ్మి పద్మరాజు గారి ‘అప్పుడు’

పైరుగాలికి నాట్యమాడే
పైటరాపిడి తగిలి చిటుకున
పండిపోయిన దానిమ్మొకటి
పగిలి విచ్చింది
పండుదొండకు సాటివచ్చే
పడతిపెదవులలోన దాగిన
పండ్లముత్తెపుపుతళుకు లన్నీ
పక్కుమన్నాయి.

అప్పుడు నెననుకున్నాను
అందానికి కర్థం ఇదే నని.

గట్లమీదా పుట్లమీదా
గంతులేస్తూ తిరిగివచ్చిన
కోడెదూడని బాడి అయినా
గోవు నాకింది
దుస్తులంతా దుమ్ముపడినా
దులపకుండా చేరవచ్చిన
కన్నతండ్రిని తల్లి ఎత్తుకు
కౌగలించింది.

అప్పుడు నేననుకున్నాను
ఆనంద మంటే ఇదే నని.

తేనె కోసం పూవుపూవుకి
తిరుగుతుండే గండుతుమ్మెద
కాలికంటిన పుప్పొడంతా
పూల కంటింది.
పూటపూటకు సేకరించిన
పూరజంతో బరువులెక్కిన
విరులగుత్తులు పురుడుపోసుకు
పిందెలయినాయి.

అప్పుదు నే ననుకున్నాను
అచ్చపుసత్యం ఇదే నని.

2 thoughts on “శివం-సుందరం-సత్యం -పాలగుమ్మి పద్మరాజు గారి ‘అప్పుడు’

  1. నిజానికి పాప గారు..కథలకన్నా..కవితల్లోనే తన ప్రతిభ ఎక్కువ కనబరిచారనిపిస్తుంది. కానీ ఎందుకో పాప కవిగా కన్నా కథారచయితాగానే ఎక్కువ గుర్తింపు పొందారు?!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s