మహా..బాగుంది

 

మహా..బాగుంది

కర్లపాలెం హనుమంతరావు

బాల పాపలలోని లీలా వికాసాలను

కర్మయోగము చేత కాంచి కాంచి,

యోగ ముద్ర ఉద్వృత్తి రాగులైన భోగుల

తర్క సిధ్ధాంతాలను తరిచి తరిచి,

మాటిమాటికి మరులు చాటే తేటులపాట

తేట లోపలి నిగ్గు తీసి తీసి,

అబ్జజాండము మొదలు అణువుదాక కనగలుగు

వేదాంతమార్గములను వెతికి వెతికి,

ప్రకృతి, సృష్టి, అంతస్సార రహస్యాలను

వెలికి తీసినా కాని అంతుబట్టని వింతలు కొన్ని.

రాతిలో కప్పకు మేత వేసిన చేత

పసువులకు కసువులో విషము పెట్టుట ఏల?

కారు మేఘాలలో కానాలనంబుంచి

ఫణిశిరమునందు మణి నమర్చుటేమి లీల?

రమకు లుబ్ధునితో కాపురము చేయించు!

పద్మాలయములో షట్పదముల భోజనముంచు!

కడు దురాత్ముడై రావణుడు కష్టపడెనందుమన్న

రాముడేల పన్నమందె?

చెడు సుయోధనుడె పెన్మడుగున పడెనటన్న

ధర్మజుడడవుల ఏల కుందె?

మతి లేకయె వాలి దుర్గతుల పాలవుటయన్న

సుగ్రీవుడ ద్రిలో ఏల కుంగె?

రాకాసితనము వలనె అల్ల శూర్పణఖా టెంకెజెల్లలన్న

పరమసాథ్వీమ లలన సీతమ్మకేల లంక కాన?

పాపులని భక్తులని భేధ మేముంది?

అంతుపట్టని లీల ఇది మహా..బాగుంది!

భక్త ముని జన హృద్వాస పరమపురుషా

గారడీవాడి ఇంద్రజాలము గతి

నాటకము చేసి నడుపుటేలనో జగతి?

 

 

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s