మార్పు-దీపాల పిచ్చయ్య శాస్త్రి గారు

దీపాల పిచ్చయ్యా శాస్త్రి గారు॥మార్పు॥

ప్రభులు మాఱిరి ప్రభుధర్మములు మాఱె

రాజ్యములు మాఱె, రాజ్యతంత్రములు మాఱె

ప్రజలు మాఱిరి ప్రజలభావములు మాఱె

ప్రకృతిసిద్ధంబు మార్పు ప్రపంచమునకు

మాఱకుండు పదార్థమీమహిని సున్న

మార్పెరుంగనిదొక్క బ్రహ్మంబు దక్క.

కవులుమఱిరి పాఠకగణము మాఱె

కావ్యములు మాఱె కావ్యలక్షణములు మాఱె

కథలు మాఱె కథానకక్రమము మాఱె

వాజ్ఞ్మయము మాఱె వాజ్ఞ్మయఫలము మాఱె

మాఱకుండునదేది? భూమండలమున

మార్పెరుంగనిదొక్క బ్రహ్మంబు దక్క.

ప్రజల గుర్తించి ప్రభువును, ప్రభువు నెఱిగి

ప్రజలు మాఱుట మేలు పరస్పరంబు,

ఎడ్డెలయి మాఱకుండుదురయేని రెండు

తెగల కరయ మనశ్శాంతి గగనసుమము

లాభ మంతకుమున్నె హుళక్కి గాన

కలుగునె సుఖంబు? షష్ఠాకంబుగాక.

కవులు చూపు కొత్తమార్గముల నెఱిగి

పాఠకులు, పాఠకుల మనోవాంచ లెఱిగి

కవులు మారుట హర్ష సంగతికి దెరువు

ముప్పెలయి మారకున్నచో మూగ చెవిటి

ముచ్చటలు కావె యవ్వారి మొత్తుకోళ్ళు.

కవులు, పండితులు, భూధవులు, మఱియు

కావ్యములు, శాస్త్రములు, రాచకార్యములును

మతము, లాచారములు గూడ మాఱుచుండ

నెవరు మాఱినగాని మా కేమి మేము

మాఱము ‘ససేమిరా’ యనుమనుజగణము

నెల్ల ఋతువుల మార్పొకయింత లేక

ఒక్కతీరుననే పడియుండు పాడు

మోడుమ్రాకులతో బోల్ప  బోలదేమొ?

ఎవ్వరికిగాని కాల మొకేవిధాన

జరగబో దెల్లకాలంబు సమయమునకు

దగినవేషంబు వేయుట తజ్ జ్ఞహితము

బండవలె మాఱకుండుట పాషాండమతము.

అగ్రమున నున్నవారెల్ల రమ్తమునకు

నంతమున నున్న వారెల్లా రగ్రమునకు

నెగుడుదిగుడైనవిధ మదియెల్ల యెఱిగి

మార్పునందుట ప్రాజ్ఞసమ్మతమతంబు.

NOTE: దీపాల పిచ్చయ్య శాస్త్రిగారు యెనభయ్యారేళ్ళకితం రాసిన కవిత ఇది. ఆంధ్రపత్రిక అక్షయ సంవత్సర ఉగాది ప్రత్యేక సంచికలో ప్రచురితం. చాదస్తుల కాలం అని మనం వెక్కిరించుకునే రోజుల్లోనే మార్పు అనివార్యతను గూర్చి స్పష్టమైన అభ్యుదయ భావజాలంతో సరళమైన చందస్సు నెన్నుకుని శాస్త్రి గారు చేసిన చక్కని సృజన ఇది. నేటి అభ్యుదయవాదులకూ ఒక చక్కని కవితామార్గం నిర్దేశించేవిధంగా ఉందనే ఇక్కడ తిరిగి ప్రచురించింది.’పాతంతా రోత కాదు.మంచి మాట ఎటునుంచి వచ్చినా ఆలకించాల్సిందే’ అన్న నా భావాన్ని బలపరుచుకోవడానికీ ఇక్కడ నాకు దొరికిన ఈ పాతబంగారాన్ని ప్రదర్శనకు పెట్టాను.చూడాలి ఇప్పటి కవులు ఎలా స్పందిస్తారో!

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s